- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
పైడి జైరాజ్ పేరుతో అవార్డులు ఇచ్చే యోచన: శ్రీనివాస్ గౌడ్
దిశ, తెలంగాణ బ్యూరో: దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత పైడి జైరాజ్ తెలంగాణ దేశం గర్వించదగ్గ గొప్ప నటుడు అని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. కరీంనగర్ నుండి సినిమా హీరో కావాలనే లక్ష్యంతో ముంబై వెళ్లి అప్పటి మూకీ సినిమాల కాలంలోనే నటుడుగా ప్రస్థానం ప్రారంభించి, ఆ తర్వాత టాకీ సినిమాలలో కూడా నటించి భారతీయ వెండి తెరపై మొదటి యాక్షన్ హీరోగా పేరు పొందారని అన్నారు. 120కి పైగా సినిమాలలో హీరోగా నటించి తొలితరం బాలీవుడ్ సూపర్ స్టార్ గా ఎదిగారన్నారు. ఈమేరకు పైడి జైరాజ్ సేవలకు గుర్తుగా రవీంద్ర భారతిలోని ప్రివ్యూ థియేటర్ కు పైడి జైరాజ్ ప్రివ్యూ థియేటర్ గా పేరు పెట్టి గౌరవిస్తున్నామన్నారు.
ఈ థియేటర్ ఇప్పుడు నవతరం సినీ దర్శకులు, రచయితలు, నటులకు కేరాఫ్ అడ్రస్ గా మారిందని, షార్ట్ ఫిలింలు ప్రదర్శించడం కోసం ఏర్పడ్డ ఒకే ఒక థియేటర్ గా దేశం మొత్తం మీద ప్రత్యేకతను సాధించిందని అభినందించారు. వీటితో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కళాకారులకు భవిష్యత్ లో ఇచ్చే అవార్డులకు ఇచ్చే విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. కాగా, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో ఏర్పాటు చేసిన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత, ప్రముఖ బాలీవుడ్ నటుడు పైడి జైరాజ్ 112 వ జయంతి కార్యక్రమంలో మంగళవారం రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొని చిత్ర పటానికి నివాళులు అర్పించారు.
- Tags
- Awards