ఆ వ్యాఖ్యలపై పుట్ట మధుకు శ్రీధర్ బాబు ఇన్ డైరెక్ట్ కౌంటర్

by Sridhar Babu |
ఆ వ్యాఖ్యలపై పుట్ట మధుకు శ్రీధర్ బాబు ఇన్ డైరెక్ట్ కౌంటర్
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: వామన్ రావు, నాగమణి దంపతుల హత్య కేసులో వార్త సమాచార సేకరణ విషయంలో ప్రెస్ మీడియాపై జడ్పీ చైర్మన్ పుట్టమధు చేసిన వ్యాఖ్యలపై మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు స్పందించారు. పుట్ట మధు పేరు ఎత్తకుండానే శ్రీధర్ బాబు కామెంట్స్ చేశారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ… ‘ప్రెస్ మీడియాను ఎవరైనా కొనగలరా ? అదేమైనా వస్తువా? చింతకాయలా కొనడానికి, అమ్మడానికి. జర్నలిస్టులు వారు సేకరించిన విషయాలను.. వారి వారి కోణాల్లో ఇస్తుంటారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి స్పందించాలి.

కేసు విచారణలో పారదర్శకత ఉండాలని, హత్యతో సంబంధం ఉన్న వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. అయితే ఈ కేసుతో సంబంధం లేని వారిని ఇరికించాల్సిన అవసరం లేదు. అలా చేస్తే కేసును తప్పుదోవ పట్టించినట్టవుతుంది. జంట హత్యలు జరిగిన తర్వాత బాధ్యత గల శాసనసభ్యునిగా విచారణ జరిపించాలని కోరడం తప్పా. న్యాయవాదుల జంట హత్యపై నిజానిజాలు తేల్చాల్సిన బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి , ప్రభుత్వంపై ఉంది. కొంత మంది తన పేరును ఊతపదంలా వాడుకుంటున్నారు’ అని అన్నారు.

Advertisement

Next Story