- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఈ 'శ్రమ్ కార్డు' తో కార్మికులకు భరోసా
దిశ, రామన్నపేట: కేంద్ర ప్రభుత్వం అసంఘటిత రంగ కార్మికులకు వివిధ సంక్షేమ పథకాలు వర్తింప చేసేందుకు ఈ శ్రమ్ పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చింది. కార్మికులు ఆన్‌లైన్ పోర్టల్‌లో తమ వివరాలు నమోదు చేసుకోవాలి. తద్వారా పలు రకాల ప్రయోజనాలు పొందేందుకు వీలు కలుగుతుంది. ఈ అవకాశం ఈ నెల 31 వరకు కేంద్రం గడువు విధించింది.
ప్రయోజనం ఏమిటి..
ఈ శ్రమ కార్డు పొందిన ప్రతి కార్మికుడికి 12 అంకెల ప్రత్యేక గుర్తింపు కలిగిన నెంబర్ యూనివర్సల్ అకౌంట్ నెంబర్ కేటాయిస్తారు. ఈ కార్డు ద్వారా భవిష్యత్తులో ప్రభుత్వ సంక్షేమ పథకాలు, సామాజిక భద్రత తదితర అవకాశాలు వర్తిస్తాయి. కుటుంబంలో ఇద్దరు అసంఘటిత రంగ కార్మికులు ఉంటే ఒక్కరికే పథకాలు వర్తించేవి. కానీ ప్రస్తుతం ఈ శ్రమ కార్డుతో అందరికీ ప్రయోజనం చేకూరుతుంది.
ప్రమాద బీమా సౌకర్యం..
ఈ శ్రమ కార్డు పొందిన ప్రతి కార్మికుడికి ఏడాదిపాటు ప్రధానమంత్రి సురక్ష బీమా యోజనలో భాగంగా రూ.2 లక్షల ప్రమాద బీమా సౌకర్యం, పాక్షికంగా అంగవైకల్యం పొందితే రూ.1 లక్ష బీమా వర్తిస్తుంది.
ఎవరికి అర్హత..
19 ఏళ్ల నుండి 59 ఏళ్ల వరకు వయసు కలిగిన అసంఘటిత రంగ కార్మికులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఆదాయపు పన్ను చెల్లించని వారు, ఈఎస్ఐ, ఈపీఎఫ్, వంటి సదుపాయాలు లేని వారు దరఖాస్తు చేయడానికి అర్హత పొంది ఉంటారు.
దరఖాస్తు ఎలా..
మీసేవ కేంద్రాలు కానీ, తమ దగ్గర ఉన్న స్మార్ట్ ఫోన్ ల ద్వారా గాని ఈ శ్రమ వెబ్ సైట్ లోకి వెళ్లి తమ వివరాలు నమోదు చేసుకోవచ్చు. ఆధార్ కార్డుతో ఫోన్ నెంబర్, బ్యాంకు అకౌంట్ నెంబర్, తదితర వివరాలను నమోదు చేసిన తర్వాత కార్డు ప్రత్యక్షమవుతుంది. డౌన్ లోడ్ ద్వారా ప్రింట్ తీసుకొని లామినేషన్ చేసుకొని తమ వద్ద ఉంచుకోవచ్చు. ఈ కార్డు లో 12 అంకెలు కలిగిన యూనివర్సల్ అకౌంట్ నెంబరు ఉంటుంది. ఈ అకౌంట్ నెంబర్ ద్వారానే ప్రభుత్వం కల్పించే సౌకర్యాలు, పథకాలు పొందే అవకాశం కలుగుతుంది.
ప్రతి కార్మికుడు నమోదు చేసుకోవాలి..
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన ఈ శ్రమ కార్డు పొందడానికి సంఘటిత రంగం కార్మికులు అర్హత కలిగి ఉన్నారు. కార్మికులు వెబ్‌సైట్ తమ వివరాలు నమోదు చేసుకొనుటకు రెండు రోజుల సమయం ఉన్నందున ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు పొందడానికి అవకాశం ఉంటుంది. మేము ఇప్పటికే చాలా మందికి అవగాహన కల్పించి వివరాలు నమోదు చేశారు.
- Tags
- modi