- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జింబాబ్వే సంచలనం.. వరల్డ్ కప్ క్వాలిఫైయర్స్ లో విండీస్ కు పరాభవం
దిశ, వెబ్ డెస్క్ : 2022 టీ20 వరల్డ్ కప్‌లో పాకిస్తాన్‌ని ఓడించిన జింబాబ్వే, క్వాలిఫైయర్స్‌లో విండీస్‌పై 35 పరుగుల తేడాతో సంచలన విజయం అందుకుంది. దీంతో వరల్డ్ కప్ క్వాలిఫైయర్స్‌లో వెస్టిండీస్ జట్టుకు ఘోర పరాభవం ఎదురైంది. దీంతో రెండు సార్లు వన్డే వరల్డ్ కప్ విజేతగా నిలిచిన వెస్టిండీస్, ఈసారి ప్రపంచకప్‌కి అయినా అర్హత సాధించడం కూడా అనుమానంగానే మారింది.
తొలుత టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 49.5 ఓవర్లలో 268 పరుగులకి ఆలౌటైంది. కెప్టెన్ క్రెగ్ ఎర్విన్ 58 బంతుల్లో 7 ఫోర్లతో 47 పరుగులు చేయగా గుంబీ 26, సీన్ విలియమ్స్ 23 పరుగులు చేశారు. ఆల్‌రౌండర్ సికందర్ రజా 58 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 68 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలవగా రియాన్ బర్ల్ 57 బంతుల్లో 5 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 50 పరుగులు చేశాడు. విండీస్ బౌలర్లు కీమో పాల్‌కి 3 వికెట్లు దక్కగా అల్జెరీ జోసఫ్, అకీల్ హుస్సేన్ రెండేసి వికెట్లు తీశారు. 269 పరుగుల లక్ష్యఛేదనలో 233 పరుగులకే ఆలౌట్ అయిన వెస్టిండీస్, 35 పరుగుల తేడాతో ఘోరంగా ఓడింది.
బ్రెండన్ కింగ్ 12 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 20 పరుగులు చేయగా కేల్ మేయర్స్ 56 పరుగులు చేశాడు. షై హోప్ 30 పరుగులు చేయగా నికోలస్ పూరన్ 34, రోస్టన్ ఛేజ్ 44 పరుగులు చేశారు. జాసన్ హోల్డర్ 19 పరుగులు మినహా బ్యాటర్లు సింగిల్ డిజిట్ స్కోరుకు పరిమితయ్యారు. రెండు సార్లు టీ20 వరల్డ్ కప్ లు సాధించిన వెస్టిండీస్, 2022 పొట్టి ప్రపంచకప్ టోర్నీలో గ్రూప్ స్టేజీ నుంచే నిష్కమించి, ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. జింబాబ్వే చేతుల్లో ఓడినా వెస్టిండీస్, సూపర్ సిక్స్ రౌండ్‌కి అర్హత సాధించింది.
ఈ విజయంతో గ్రూప్-Aలో మూడు మ్యాచుల్లో మూడు విజయాలు అందుకున్న జింబాబ్వే, 6 పాయింట్లతో టేబుల్ టాపర్‌గా సూపర్ సిక్సర్స్ గ్రూప్‌కి అర్హత సాధించింది. వెస్టిండీస్, నెదర్లాండ్స్ కూడా 3 మ్యాచుల్లో రెండేసి విజయాలతో 4 పాయింట్లు సాధించి సూపర్ సిక్స్ గ్రూప్‌కి దూసుకెళ్లాయి. అదేవిధంగా గ్రూప్-B నుంచి శ్రీలంక, స్కాట్లాండ్, ఓమన్ జట్లు సూపర్ సిక్సర్స్ రౌండ్‌కి అర్హత సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ మూడు జట్లు కూడా రెండేసి విజయాలు సాధించాయి. మూడు మ్యాచ్ లలో ఓడిన యూఏఈ ఇప్పటికే సూపర్ సిక్స్ రేసు నుంచి తప్పుకున్నాయి. వరుసగా రెండ్ మ్యాచుల్లో ఓడిన ఐర్లాండ్, మిగిలిన రెండు మ్యాచుల్లో గెలిస్తే సూపర్ సిక్స్ రౌండ్‌కి అర్హత సాధించే అవకాశం ఉంటుంది.