ఐదో టీ20 మ్యాచ్: టాస్ గెలిచిన జింబాబ్వే.. జట్టులోకి ఇద్దరు కీలక ప్లేయర్లు

by Mahesh |
ఐదో టీ20 మ్యాచ్: టాస్ గెలిచిన జింబాబ్వే.. జట్టులోకి ఇద్దరు కీలక ప్లేయర్లు
X

దిశ, వెబ్‌డెస్క్: భారత్- జింబాబ్వే టూర్ లో భాగంగా నేడు ఐదో టీ20 మ్యాచ్ హరారే వేదికగా జరుగుతుంది. ఈ మ్యాచులో టాస్ గెలిచిన జింబాబ్వే జట్టు బౌలింగ్ ఎంచుకుంది. దీంతో భారత్ మొదట బ్యాటింగ్ చేయనుంది. ఈ మ్యాచులో ఐపీఎల్ స్టార్ ప్లేయర్లు, సంజూ శాంసన్, రియాన్ పరాగ్ తుది జట్టులో స్థానం దక్కించుకున్నారు. ఇప్పటి వరకు నాలుగు మ్యాచులు జరగ్గా వరుసగా మూడు మ్యాచ్ లో విజయం సాధించిన భారత్ టీ20 సిరీస్ ను కైవసం చేసుకుంది. దీంతో ఈ మ్యాచులో అయిన గెలిచి పరువు కాపాడుకోవాలని జింబాబ్వే జట్టు చూస్తుండగా భారత యువ ప్లేయర్లు తమ సత్తాను మరోసారి చాటేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ఈ రోజు టీ20 జట్టు లోకి ఎంట్రీ ఇచ్చిన రియాన్ పరాగ్ ఏ మేరకు రాణిస్తారో వేచి చూడాలి మరి.

భారతదేశం (ప్లేయింగ్ XI): శుభమన్ గిల్ (సి), యశస్వి జైస్వాల్, అభిషేక్ శర్మ, సంజు శాంసన్ (w), రియాన్ పరాగ్, రింకూ సింగ్, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, తుషార్ దేశ్‌పాండే, ముఖేష్ కుమార్

జింబాబ్వే (ప్లేయింగ్ XI): వెస్లీ మాధేవెరే, తడివానాషే మారుమణి, బ్రియాన్ బెన్నెట్, డియోన్ మైయర్స్, సికందర్ రజా(సి), జోనాథన్ క్యాంప్‌బెల్, ఫరాజ్ అక్రమ్, క్లైవ్ మదాండే(w), బ్రాండన్ మవుటా, రిచర్డ్ నగరవ, బ్లెస్సింగ్ ముజరబానీ

Advertisement

Next Story