- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సత్తాచాటిన తెలుగమ్మాయి శ్రీజ
దిశ, స్పోర్ట్స్ : అమెరికాలో జరుగుతున్న వరల్డ్ టేబుల్ టెన్నిస్(డబ్ల్యూటీటీ) ఫీడర్ కార్పస్ క్రిస్టీ టోర్నీలో హైదరాబాదీ అమ్మాయి, భారత స్టార్ క్రీడాకారిణి ఆకుల శ్రీజ సత్తాచాటింది. టోర్నీలో సెమీస్‌కు దూసుకెళ్లింది. గురువారం జరిగిన ఉమెన్స్ సింగిల్స్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో శ్రీజ 3-2(11-9, 9-11, 11-1, 6-11, 11-9) తేడాతో అమెరికా క్రీడాకారిణి అమీ వాంగ్‌ను చిత్తు చేసింది. తొలి నాలుగు గేమ్‌ల్లో ఇద్దరు చెరో రెండు గేమ్‌లను దక్కించుకోవడంతో మ్యాచ్ నిర్ణయాత్మక ఐదో గేమ్‌కు వెళ్లింది. అక్కడ ఓ దశలో శ్రీజ 3-9తో వెనుకబడి మ్యాచ్‌ను కోల్పోయేలా కనిపించింది. ఈ పరిస్థితుల్లో ఆమె అద్భుతంగా పుంజుకుంది. వరుసగా పాయింట్లు గెలుస్తూ 9-9తో స్కోరును సమం చేసింది. అంతేకాకుండా, వరుసగా 4 పాయింట్లు గెలిచి ఐదు గేమ్‌ను నెగ్గి మ్యాచ్‌ను దక్కించుకుంది. సెమీస్‌లో మరో అమెరికా క్రీడాకారిణి జియాంగ్‌షాన్ గువోతో శ్రీజ తలపడనునుంది. మెన్స్ సింగిల్స్‌లో భారత ఆటగాడు మానవ్ వికాశ్ సెమీస్‌కు అర్హత సాధించాడు. క్వార్టర్ ఫైనల్‌లో నియాగోల్ స్టోయనోవ్(ఇటలీ)ను 3-1(11-6, 11-8, 7-11, 12-10) తేడాతో ఓడించాడు. మరో భారత ఆటగాడు హర్మీత్ దేశాయ్ క్వార్టర్స్ ఓడి టోర్నీ నుంచి నిష్ర్కమించాడు.