WTC Final 2023: స్టీవ్‌ స్మిత్‌ అరుదైన రికార్డ్..

by Vinod kumar |
WTC Final 2023: స్టీవ్‌ స్మిత్‌ అరుదైన రికార్డ్..
X

దిశ, వెబ్‌డెస్క్: WTC Final 2023లో భాగంగా టీమిండియాతో మ్యాచ్‌లో జరుగుతున్న మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ప్లేయర్ స్టీవ్‌ స్మిత్‌ ఒక అరుదైన రికార్డు సాధించాడు. ఈ మ్యాచ్‌లో కోహ్లి క్యాచ్‌ అందుకోవడంతో స్టీవ్‌ స్మిత్‌.. టెస్టు క్రికెట్‌లో ఆసీస్‌ తరపున అత్యధిక క్యాచ్‌లు అందుకున్న జాబితాలో స్మిత్‌ మూడో స్థానానికి చేరుకున్నాడు. ఐదోరోజు ఆట ప్రారంభమైన తర్వాత స్కాట్‌ బోలాండ్‌ బౌలింగ్‌లో కోహ్లి ఇచ్చిన క్యాచ్‌ను స్మిత్‌ అద్బుతంగా డైవ్‌ చేస్తూ అందుకున్నాడు.

ఈ క్యాచ్ స్టీవ్‌ స్మిత్‌‌కి 157వది.. ఈ జాబితాలో తొలి స్థానంలో రికీ పాంటింగ్‌ 196 క్యాచ్‌లతో ఉ‍న్నాడు. 181 క్యాచ్‌లతో మార్క్‌ వా రెండో స్థానంలో ఉండగా.. మార్క్‌ టేలర్‌తో కలసి స్టీవ్‌ స్మిత్‌ 157 క్యాచ్‌లతో సంయుక్తంగా మూడో స్థానంలో ఉన్నాడు. అలెన్‌ బోర్డర్‌ 156 క్యాచ్‌లతో నాలుగో స్థానంలో ఉన్నాడు.

Advertisement

Next Story