WTC Final 2023: మా బలాలపై ఫోకస్ పెడతాం : రోహిత్ శర్మ

by Vinod kumar |
WTC Final 2023: మా బలాలపై ఫోకస్ పెడతాం : రోహిత్ శర్మ
X

లండన్: భారత క్రికెట్‌ను ముందుకు తీసుకెళ్లడంలో ఆటగాళ్లు తమ పాత్ర పోషిస్తారని టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. ఆస్ట్రేలియాతో వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్‌(డబ్ల్యూటీసీ) ఫైనల్‌కు ముందు మంగళవారం నిర్వహించిన ప్రెస్‌కాన్ఫరెన్స్‌లో రోహిత్ పలు విషయాలు వెల్లడించాడు. ‘ప్రతి కెప్టెన్ చాంపియన్‌షిప్ గెలవాలనుకుంటాడు. నేనూ అంతే. నేను ఈ బాధ్యతల నుంచి వెళ్లాలనుకున్నప్పుడు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ చాంపియన్‌షిప్ గెలిచి ఉంటే బాగుంటుంది కదా. మేము ఏం గెలిచామో, ఏం ఓడామో మాకు తెలుసు. దాని గురించి ఎక్కువ ఆలోచించి ప్రయోజనం లేదు. అందుకే ఎక్కువ ఒత్తిడి తీసుకోవాలనుకోవడం లేదు’ అని తెలిపాడు. ‘డబ్ల్యూటీసీ ఫైనల్‌లో ఏం చేయాలో మా ఆటగాళ్లు తెలుసు.

మా బలాలపై ఫోకస్ పెడతాం.’అని చెప్పాడు. అశ్విన్ ఎంపికపై మాట్లాడుతూ.. ఇంగ్లాండ్‌లో ప్రతి రోజు పరిస్థితులు మారుతుంటాయని, తుది జట్టు ఎంపికపై నేడు క్లారిటీ వస్తుందని తెలిపాడు. పిచ్ సీమర్లకు అనుకూలించేలా కనిపిస్తుందని చెప్పాడు. ‘గత ఎడిషన్‌లో మేము కొన్ని తప్పులు చేశాం. జట్టు సభ్యులతో వాటి గురించి ఇప్పటికే చర్చించాం. ఆ తప్పులను ఈ సారి పునరావృతం చేయాలనుకోవడం లేదు. వచ్చే ఐదు రోజులు తమకు చాలా ముఖ్యమైనవి. మేము ఏదైతే అనుకుంటున్నామో దానిపై ఫోకస్ పెడతాం’ అని చెప్పుకొచ్చాడు.

రోహిత్‌కు గాయం..

డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ముందు కెప్టెన్ రోహిత్ శర్మ గాయపడటం టీమ్ ఇండియాను ఆందోళనకు గురిచేస్తున్నది. ప్రాక్టీస్‌లో అతని ఎడమ బొటన వేలికి గాయమైంది. వేలికి బ్యాండేజ్‌తో కనిపించాడు. అయితే, గాయం అంత తీవ్రమైనది కాదని తెలుస్తోంది. బ్యాండేజ్‌తోనూ కాసేపు ప్రాక్టీస్ చేసిన రోహిత్.. కాసేపటి తర్వాత కట్టును తొలగించాడు.


Advertisement

Next Story