- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
వరల్డ్ టేబుల్ టెన్నిస్ టీమ్ చాంపియన్‌షిప్‌లో ముగిసిన భారత జట్ల పోరాటం
దిశ, స్పోర్ట్స్ : సౌత్ కొరియాలో జరుగుతున్న వరల్డ్ టేబుల్ టెన్నిస్ టీమ్ చాంపియన్‌సిప్‌లో భారత పురుషుల, మహిళల జట్ల పోరాటం ముగిసింది. బుధవారం ప్రీక్వార్టర్స్ మ్యాచ్‌ల్లో భారత జట్లు ఓటమి పాలయ్యాయి. పురుషుల టీమ్ విభాగంలో రౌండ్-32 మ్యాచ్‌లో భారత్ 3-2 తేడాతో కజకిస్తాన్‌ను ఓడించి ప్రీక్వార్టర్స్‌కు చేరుకుంది. అక్కడ కొరియాతో తలపడిన భారత్ 0-3 తేడాతో పరాజయం పాలైంది. హర్మీత్ దేశాయ్, శరత్ కమల్, సత్యన్ జ్ఞానేశ్వరన్ వరుస మ్యాచ్‌ల్లో పరాజయం పాలయ్యారు. మహిళల జట్టూది అదే పరిస్థితి. రౌండ్-32 మ్యాచ్‌లో ఇటలీపై 0-3 తేడాతో ఏకపక్ష విజయం అందుకుంది. అయితే, ప్రీక్వార్టర్స్‌లో మాత్రం చైనీస్ తైపీ చేతిలో 1-3 తేడాతో ఓడింది. తొలి గేమ్‌లో మనిక బాత్రా గెలిచి శుభారంభం అందించినా.. ఆ తర్వాత ఆకుల శ్రీజ, ఐహిక ముఖర్జీ, రివర్స్ మ్యాచ్‌లో మనిక బాత్రా వరుసగా పరాజయం పొందడంతో భారత్ ఓటమి తప్పలేదు. ఈ టోర్నీలో భారత జట్లు క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుంటే నేరుగా పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించేవి. అయితే, ఇప్పటికీ ఇంకా ఆశలు సజీవంగానే ఉన్నాయి. టీమ్ ర్యాంకింగ్స్ ఆధారంగా భారత జట్లు ఒలింపిక్ బెర్త్‌లు సాధించే అవకాశం ఉంది.