- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఆయిల్ పామ్ సాగుపై ప్రభుత్వం ఫోకస్.. 14 కంపెనీలకు అనుమతి
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్ పామ్ సాగుపై ప్రత్యేక దృష్టిసారించింది. పలు కార్యక్రమాలతో వ్యవసాయ, అనుబంధ రంగాలను లాభదాయకంగా మార్చేందుకు అన్నిచర్యలు తీసుకుంటోంది. రాష్ట్రంలో పెరిగిన పంట మార్పిడి ఆవశ్యకత దృష్ట్యా పామ్ ఆయిల్ సాగును పెద్ద ఎత్తున చేపట్టేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. వంటనూనెల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించడానికి కేంద్ర ప్రభుత్వం 1992 నుంచి వివిధ కార్యక్రమాలతో ఆయిల్ పామ్ అభివృద్ధిని ప్రోత్సహిస్తోంది. ప్రస్తుతం, రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగు, కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత కార్యక్రమం అయిన నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్ – ఆయిల్ పామ్ (ఎన్ఎంఈఓ-ఓపీ)తో అమలు చేస్తుంది.
రాష్ట్రంలోని31 జిల్లాల్లో ఆయిల్ పామ్ సాగు విస్తరణ చేపట్టేందుకు 14 కంపెనీలకు అనుమతులిచ్చింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 1993లో మొదటి ఆయిల్ పామ్ తోటను ప్రారంభించారు. ఆయిల్ ఫెడ్ సంస్థ ఆయిల్ పామ్ సాగు పెంచడానికి కృషి చేసింది. రాష్ట్రంలో 8 జిల్లాలో ఆయిల్ పామ్ సాగు చేపడుతున్నది. రాష్ట్రంలో 1992-93 నుంచి ఇప్పటివరకు సుమారు 2.27 లక్షల ఎకరాలు ఆయిల్ పామ్ సాగులోకి రాగా అందులో 34,338 రైతులకు సంబంధించి 1.38 లక్షల ఎకరాలు (రాష్ట్రంలో 61% ఆయిల్ పామ్ విస్తీర్ణం) తెలంగాణ ఆయిల్ ఫెడ్ జిల్లాల్లోనే ఉన్నది. ఎన్ఎంఈఓ-ఓపీ పథకంలో భాగంగా 2021-22 నుంచి ఆయిల్ ఫెడ్ 24326 రైతులకు సంబంధించి 91784 ఎకరాలలో ఆయిల్ పామ్ సాగు చేపట్టింది. ఆయిల్ ఫెడ్ ఆధ్వర్యంలో గంటకు 120 టన్నులు గెలలు ఆడించగల సామర్థ్యం ఉన్న మిల్లులు అశ్వారావుపేట, అప్పారావు పేట లో పని చేస్తున్నాయి.
ఆయిల్ పామ్ మొక్కలు పెంచడం కోసం, ఇప్పటి వరకు 12 నర్సరీలు ఏర్పాటు చేసిరైతులకు నాణ్యమైన మొక్కలు అందించడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. ఆయిల్ ఫెడ్ వద్ద ప్రస్తుతం 70 వేల ఎకరాలకు సరిపడా ఆయిల్ పామ్ మొక్కలు అందుబాటులో ఉన్నాయి. ప్రపంచంలో మలేషియా, ఇండోనేషియా ఆయిల్ పామ్ రంగంలో అద్భుతమైన పురోగతి సాధించి మిగిలిన దేశాలకు ముడి పామాయిల్ను పెద్ద ఎత్తున ఎగుమతి చేస్తున్నాయి. మలేషియా ఆయిల్ పామ్ పెంపకంలో అవలంబిస్తున్న సాంకేతికతలు, పంట ఉత్పత్తి పద్ధతులపై అధ్యయనానికి అక్టోబర్ 23 నుంచి 26 వరకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో బృందం పర్యటించింది. మొక్కల పెంపకం, ప్రాసెసింగ్ కర్మాగారాలను పరిశీలించారు.
రైతులకు అధిక ధరలను అందించి, ఆయిల్ పామ్ సాగును లాభసాటిగా చేసి రైతులను ప్రోత్సహించేందుకు, ముడి పామ్ ఆయిల్ పై దిగుమతి సుంకాన్ని తిరిగి విధించి దేశీయ పామ్ ఆయిల్ రైతులను ప్రోత్సహించుటకు చర్యలను తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. సానుకూలంగా స్పందించి గెజిట్ నోటిఫికేషన్ ద్వారా, ముడి పామ్ ఆయిల్ దిగుమతి పై సుంకాన్ని 27.5%కు పెంచింది. దీంతో ప్రస్తుతం ఆయిల్ పామ్ గెలల ధర టన్నుకు రూ.19,144కు పెరగడం జరిగినది. రాష్ట్రంలోని రైతులు పెద్ద ఎత్తున ఆయిల్ పామ్ సాగు చేపట్టి దేశంలోని రైతాంగానికి మార్గదర్శకంగా నిలవాలని టీజీ ఆయిల్ ఫెడ్ ఎండీ ఎస్. కే. యాస్మీన్ బాషా, జనరల్ మేనేజర్ సుధాకర్ రెడ్డి కోరారు.