- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
MBA Entrance Test: ఈనెల 9న అంబేద్కర్ వర్సిటీ ఎంబీఏ ఎంట్రెన్స్ ఎగ్జామ్.. నవంబర్ 8 వరకు దరఖాస్తు గడువు
దిశ, తెలంగాణ బ్యూరో: బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం(BR Ambedkar University)లో ఎంబీఏ ఎంట్రెన్స్ టెస్ట్(MBA Entrance Test) ఈనెల 9న జరగనుందని, నవంబర్ 8వ తేదీ వరకు దరఖాస్తుకు అవకాశం కల్పించినట్లు విశ్వవిద్యాలయం పరీక్షల నియంత్రణ అధికారి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. కాగా పరీక్ష నవంబర్ 9వ తేదీన మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 4:00 గంటల వరకు హైదరాబాద్(HYD)లో విశ్వవిద్యాలయ ప్రధాన కార్యాలయంలో నిర్వహిస్తారని, ఐ-సెట్ 2024 లో అర్హత సాధించిన అభ్యర్థులు నేరుగా ఎంబీఏ కోర్సుల్లో అడ్మిషన్ పొందొచ్చని వెల్లడించారు. అంబేద్కర్ విశ్వవిద్యాలయం నిర్వహించే ఎంబీఏ ఎంట్రన్స్ టెస్ట్-2024 లో అర్హత సాధించిన అభ్యర్థులు కూడా ప్రవేశం పొందొచ్చని, ఇతర వివరాల కోసం విశ్వవిద్యాలయ పోర్టల్ www.braouonline.in లేదా వెబ్ సైట్ www.braou.ac.in సంప్రదించొచ్చని సూచించారు. ఇదిలా ఉండగా వర్సిటీకి చెందిన భూమిని జేఎన్ఏఎఫ్ఏయూ(JNAFAU)కు కేటాయించొద్దని శుక్రవారం సైతం వర్సిటీ ఆవరణలో నిరసనలు చేపట్టారు. సీఎస్‌టీడీ డైరెక్టర్ ఆనంద్ పవార్(CSTD Director Anand Pawar) ఆధ్వర్యంలో ఈ నిరసనలు కొనసాగాయి. ప్రభుత్వం జేఎన్ఏఎఫ్ఏయూకు భూకేటాయింపు నిర్ణయాన్ని విరమించుకోవాలని ఉద్యోగులు, సిబ్బంది డిమాండ్ చేశారు.