- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ధాన్యం కొనుగోలులో రాష్ట్రం తీసుకొచ్చిన మార్పులు స్ఫూర్తిదాయకం: సంజీవ్ చోప్రా
దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ ప్రభుత్వం ధాన్యం కొనుగోలులో తీసుకొచ్చిన వ్యవస్థాగత మార్పులు అభినందనీయమని భారత ప్రభుత్వ ఆహార కార్యదర్శి సంజీవ్ చోప్రా ప్రశంసించారు. ఇతర రాష్ట్రాలకు తెలంగాణా ప్రభుత్వం తీసుకొచ్చిన మార్పులు రోల్ మోడల్ గా ఉండేందుకు భారత ప్రభుత్వం దోహదపడుతుందని ఆయన చెప్పారు. శుక్రవారం రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డితో సంజీవ్ చోప్రా భేటీ అయ్యారు. ఈ భేటీలో రాష్ట్ర ప్రభుత్వ పౌరసరఫరాల శాఖ కార్యదర్శి, కమిషనర్ డి.ఎస్.చౌహాన్, వినియోగదారుల వ్యవహారాలు, పౌర సరఫరాలు ఆహార శాఖ కార్యనిర్వాహక డైరెక్టర్ జసింతా లాజరస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాష్ట్రంలో జరుగుతున్న ధాన్యం కొనుగోళ్లు, అందులో తీసుకొచ్చిన వ్యవస్థాగత మార్పులను వివరించారు. అనంతరం నగరంలోని ఏజీ కాలనీలోని చౌక ధరల దుకాణం(819) ను సందర్శించారు. అక్కడ వినియోగదారులకు పంపిణీ చేస్తున్న బియ్యం, గోధుమల నాణ్యతను పరిశీలించారు.
అక్కడ తెల్ల రేషన్ కార్డుదారులతో ముఖాముఖి భేటీ అయ్యారు. వినియోగదారులు చెప్పిన సమాధానాలు తనకు సంతృప్తినిచ్చాయని ఆయన తెలిపారు. అదే విధంగా డీలర్ మార్జిన్ పై సంభాషించిన ఆయన చౌక ధరల దుకాణం ద్వారా ఎంత ఆదాయం వస్తోందని అడిగి తెలుసుకున్నారు. నెల వారిగా 30 వేలు ఆదాయం వస్తోందని డీలర్ పేర్కొనగా విక్రయాలు పెంచుకోవడం ద్వారా లక్ష రూపాయల వరకు సంపాదించుకోవచ్చని సూచించారు. అటు నుండి నేరుగా ఎర్రమంజిల్ కాలనీ లోని పౌర సరఫరాల కార్యాలయానికి వచ్చిన ఆయనకు ధాన్యం కొనుగోలు లో తీసుకొచ్చిన వ్యవస్థాగత మార్పులతో పాటు చౌక ధరల దుకాణాల మానిటరింగ్, ఇతర అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా సంజయ్ చోప్రా మాట్లాడుతూ రాష్ట్రంలో ధాన్యం కొనుగోలుపై తీసుకొచ్చిన మార్పులపై రాష్ట్ర ప్రభుత్వానికి ఆయన కితాబిచ్చారు. రేషన్ షాప్ డీలర్ల పనితీరు భేషుగ్గా ఉందన్నారు. బియ్యం, గోధుమల సరఫరాలో నాణ్యత ప్రమాణాలు పాటిస్తున్నారన్నారు.