Breaking News : భారత ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ రోహిత్ బాల్ కన్నుమూత

by M.Rajitha |
Breaking News : భారత ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ రోహిత్ బాల్ కన్నుమూత
X

దిశ, వెబ్ డెస్క్ : భారత ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ రోహిత్ బాల్(Rohith Bal) అనారోగ్యంతో శుక్రవారం సాయంత్రం కన్ను మూశారు. కొన్ని వారాల క్రితం రోహిత్ బాల్ లాక్మే ఫ్యాషన్ వీక్(Lakme Fasion Week) లో మాట్లాడుతూ.. తన ఆరోగ్య సమస్యలను పరిష్కరించుకుని తిరిగి తన ఫ్యాషన్ సర్క్యూట్ లోకి వచ్చేస్తానని పేర్కొన్నారు. అంతలోనే ఆయన కన్నుమూయడం ఫ్యాషన్ వర్గాలు జీర్ణించుకోలేక పోతున్నారు. కాగా రోహిత్ బాల్ మరణం పట్ల ఫ్యాషన్ డిజైన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (FDCI) తీవ్ర సంతాపం తెలిపింది. ఆయన మృతి దురదృష్టకరం అని పేర్కొంది. ఫ్యాషన్ డిజైనింగ్‌లో సృజనాత్మక పద్దతులతో, భారత సంస్కృతితో, కొత్త ఫ్యాషన్లకు మెరుగులు దిద్దడంతో రోహిత్ ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించారు. భారత డిజైనింగ్ స్టైల్ మెరుగుదలకు ఆయన చేసిన కృషిని భావి తరాలు గుర్తుంచుకుంటాయి.

Advertisement

Next Story

Most Viewed