- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Fraud :ఉద్యోగం ఇప్పిస్తానని మోసం
దిశ, గొల్లపల్లి : ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి లక్షల రూపాయలు తీసుకుని మోసం చేసిన వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు గొల్లపల్లి ఎస్సై సతీష్ తెలిపారు. ఎస్సై సతీష్ తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని శంకర్రావు పేట గ్రామానికి చెందిన ఒక మహిళకు పెద్ద కంపెనీలో ఉద్యోగం ఇప్పిస్తానని, అందుకు కొంత అమౌంట్ కంపెనీకి కట్టాలని సోషల్ మీడియా వేదికగా ఓ వ్యక్తి నమ్మించాడు.
ఆ వ్యక్తి మాటలు నమ్మిన మహిళ విడతలవారీగా రూ. 3,19,000 ఆన్లైన్ ద్వారా చెల్లించింది. అయినా ఉద్యోగం రాకపోవడంతో సదరు వ్యక్తికి ఫోన్ చేయడంతో ఆ వ్యక్తి స్పందించక పోవడంతో మోసపోయానని గ్రహించి పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకున్న ఎస్సై సతీష్ సైబర్ క్రైమ్ టీం సహకారంతో నిందితుని వివరాలు తెలుసుకున్నారు. ఏపీలోని అన్నమయ్య జిల్లా నిమ్మలపల్లి గ్రామానికి చెందిన పచ్చిపాల గౌరీశంకర్(27) గా గుర్తించి అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. నిందితుడిని అరెస్టు చేయడంలో చాకచక్యంగా వ్యవహరించిన పోలీస్ సిబ్బందిని ఎస్పీ అశోక్ కుమార్ అభినందించారు.