- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Guarantees: సాధ్యమయ్యే గ్యారంటీలే ఇవ్వండి
దిశ, నేషనల్ బ్యూరో: కాంగ్రెస్(Congress Party) నాయకులు ఇష్టారీతిన హామీలు ప్రకటించరాదని, బడ్జెట్(Budget)ను దృష్టిలో పెట్టుకునే గ్యారంటీ(Guarantees)లను ప్రకటించాలని పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే(Mallikarjun Kharge) సూచించారు. ప్రణాళిక లేకుండా ఇచ్చే హామీలతో బడ్జెట్ పై భారం పడుతుందని, దివాలా(Bankruptcy) ముప్పు ఏర్పడుతుందని తెలిపారు. అది భవిష్యత్‌లో పార్టీకి తీరని నష్టాన్ని, విశ్వసనీయతకు ముప్పును తెచ్చి పెడుతుందని చెప్పారు. కర్ణాటక(Karnataka)లో శక్తి స్కీం(Shakti Scheme)ను సమీక్షిస్తామని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్(DK Shivakumar) చేసిన వ్యాఖ్యలపై ఖర్గే సీరియస్ అయ్యారు. డిప్యూటీ సీఎం డీకేను ఉద్దేశిస్తూ గురువారం ఈ వ్యాఖ్యలు చేశారు. కర్ణాటకను ఉదహరిస్తూ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న మహారాష్ట్ర, జార్కండ్ రాష్ట్రాల కాంగ్రెస్ యూనిట్లకు ఆయన సూచనలు చేశారు. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ల సమక్షంలో మీడియా సమావేశంలోనే మల్లికార్జున్ ఖర్గే ఈ వ్యాఖ్యలు బహిరంగంగా చేయడం రాజకీయ దుమారాన్ని రేపింది.
బీజేపీకి చాన్స్ ఇచ్చారు..
‘కర్ణాటకలో మీరు ఐదు గ్యారంటీలు ఇచ్చారు. మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుని మహారాష్ట్రలో కూడా ఐదు గ్యారంటీలు ఇచ్చాం. అందులో ఒకదాన్ని రద్దు చేస్తామని మీరు మాట్లాడారు. మీరు న్యూస్ పేపర్లు చదువుతున్నట్టులేరు. మీరు మాట్లాడిన మాటలు వార్తాపత్రికల్లో ఎలా వస్తున్నాయో చూశారా?’ అంటూ కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ను ఉద్దేశించి మల్లికార్జున్ ఖర్గే అన్నారు. ‘మహారాష్ట్రలో ఐదో, ఆరో, పదో ఇంకా ఇరవై గ్యారంటీలనో ప్రకటించొద్దని నేను సూచించాను. వారి బడ్జెట్ ఆధారంగానే వారి హామీలు ఉండాలని చెప్పాను. లేదంటే దివాలా తీస్తారు. రోడ్లు వేయడానికి కనీసం ఇసుక తెచ్చే డబ్బులు లేకుంటే అందరూ మిమ్మల్ని వ్యతిరేకిస్తారు. ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది. భావి తరాలకూ నష్టం కలుగుతుంది. పార్టీ విశ్వసనీయతపైనా అనుమానాలు ఏర్పడుతాయి. ఇలాంటి పనుల వల్లే పదేళ్లు అధికారానికి దూరంగా.. అజ్ఞాతంలోకి వెళ్లా్ల్సి వస్తుంది’ అని వివరించారు.
డీకే శివకుమార్ కేవలం ఆ పథకాన్ని సమీక్షిస్తామని మాత్రమే చెప్పారని, పథకాన్ని నిలిపేస్తామని చెప్పలేదని సీఎం సిద్ధరామయ్య వెంటనే సమాధానం ఇచ్చారు. ‘మీరు ఏం చెప్పారని కాదు.. విమర్శించడానికి బీజేపీకి ఒక చాన్స్ ఇచ్చారు’ అని ఖర్గే అన్నారు.
యథావిధిగా పథకాలు..
ఐదుగ్యారంటీల్లో ఒకటైన శక్తి స్కీం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని అందిస్తున్నది. ఈ పథకాన్ని సమీక్షిస్తామని బుధవారం డీకే శివకుమార్ అన్నారు. ఈ వ్యాఖ్యలను ఉద్దేశిస్తూనే ఖర్గే పై విధంగా మాట్లాడారు. తమ ప్రభుత్వం ఏ పథకాన్ని నిలిపేయడం లేదని సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రామలింగా రెడ్డి స్పష్టం చేశారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని అందించే శక్తి స్కీం కూడా యథావిధిగా కొనసాగుతుందని చెప్పారు.