Special bus :అరుణాచల గిరి ప్రదక్షణకు ప్రత్యేక బస్సు

by Sridhar Babu |
Special bus :అరుణాచల  గిరి ప్రదక్షణకు ప్రత్యేక బస్సు
X

దిశ, జగిత్యాల కలెక్టరేట్ : అరుణాచలంలో జరిగే గిరి ప్రదక్షణకు జగిత్యాల నుంచి ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సును (TGSRTC)నడపాలని జగిత్యాల డిపో నిర్ణయించింది. ఈ బస్సు నవంబర్ 13న సాయంత్రం 5 గంటలకు జగిత్యాల బస్టాండ్ నుంచి బయలుదేరి హైదరాబాద్ మీదుగా అరుణాచలం బయలుదేరుతుంది. ఇక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్ కాణిపాకంలోని విఘ్నేశ్వరుని దర్శనం, వెల్లూరులోని శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దర్శనం అనంతరం నవంబర్ 14వ తేదీ రాత్రి అరుణాచలం చేరుకుంటుంది. అరుణాచలేశ్వర స్వామి గిరి ప్రదక్షణ పూర్తయిన తర్వాత నవంబర్ 15వ తేదీ సాయంత్రం అక్కడి నుండి బయలుదేరి నవంబర్ 16వ తేదీ ఉదయం శ్రీ అలంపూర్ జోగులాంబ అమ్మవారి శక్తిపీఠం సన్నిధికి చేరుకుంటుంది.

అక్కడ దర్శనానంతరం అదే రోజు సాయంత్రం జగిత్యాల చేరుకుంటుంది. అరుణాచల గిరి ప్రదర్శనను టూర్ ప్యాకేజీలాగా అందిస్తుంది. ఈ ప్యాకేజీకి ఒక్కొక్కరికి రూ.4700, పిల్లలకు రూ.3900 టికెట్​ ధర నిర్ణయించారు. పౌర్ణమి సందర్భంగా అరుణాచల గిరి ప్రదక్షణకు భక్తుల రద్దీ దృష్ట్యా జగిత్యాల నుంచి ప్రత్యేక బస్సును ఆర్టీసీ ఏర్పాటు చేసింది. వివరాలకు సమీప ఆర్టీసీ రిజర్వేషన్ కౌంటర్లలో సంప్రదించాలని కోరారు. సర్వీస్ నెంబర్ 75556 ద్వారా బుక్ చేసుకోవాలని, ఈ టూర్ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి సమాచారం కోసం 9014958854, 9963354699, 9640205944 ఫోన్ నంబర్లకు సంప్రదించాలని జగిత్యాల డిపో మేనేజర్ కోరారు.

Advertisement

Next Story

Most Viewed