Mohammad Hafeez: 'వరల్డ్ కప్ గెలవడం కష్టం'.. టీమిండియాపై పాక్ ఆల్‌రౌండర్ సంచలన కామెంట్స్

by Vinod kumar |
Mohammad Hafeez: వరల్డ్ కప్ గెలవడం కష్టం.. టీమిండియాపై పాక్ ఆల్‌రౌండర్ సంచలన కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: వరల్డ్ కప్ 2023 అక్టోబర్ 5 నుంచి భారత్ వేదికగా జరుగనుంది. అయితే స్వదేశంలో జరుగుతున్న వరల్డ్ కప్ కావడంతో భారత జట్టు హాట్ ఫెవరెట్‌గా బరిలో దిగుతోంది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ ఆల్ రౌండర్ మహ్మద్ హఫీజ్ టీమిండియాపై హాట్ కామెంట్స్ చేశాడు. టీమిండియా చాలా మంచి జట్టు.. అయితే బెస్ట్ మాత్రం కాదంటూ ఆయన సంచలన కామెంట్స్ చేశాడు. టీమిండియా ప్లేయర్స్ ఆటను చూస్తే కనీసం నాకౌట్ వరకైనా వెళ్తారా అనే అనుమానం కలుగుతుందని హఫీజ్ అన్నాడు. వరల్డ్ కప్ టైటిల్ గెలవాలంటే మాత్రం మ్యాచ్ విన్నర్లు కావాలి.. ఐసీసీ టోర్నీలో ఏ మాత్రం ఆకట్టుకోలేకపోతున్నారని ఆయన పేర్కొన్నారు.

ఇప్పటికీ వాళ్ల దగ్గర వరల్డ్ కప్ గెలిచేందుకు కావాల్సిన టీమ్ లేదు.. జస్ప్రిత్ బుమ్రా గాయం నుంచి కోలుకుని, రీఎంట్రీ ఇస్తున్నాడు.. అతను వరల్డ్ కప్ మొత్తం ఆడగలడా?.. ఇంతకు ముందు చూపించిన ఆడగలడా? అంటూ ప్రశ్నించాడు. టీమిండియాకి చాలా సమస్యలు ఉన్నాయి.. మిడిల్ ఆర్డర్‌లో సరైన ప్లేయర్లు లేరు.. టాపార్డర్‌లో రోహిత్, విరాట్ తప్ప మిగిలిన ప్లేయర్లకు అనుభవం లేదు అంటూ మహ్మద్ హఫీజ్ అన్నారు. ఐసీసీ ఈవెంట్లలో టీమిండియా తేలిపోవడానికి ఇదే ప్రధాన కారణమన్నాడు. ఐపీఎల్‌లో బాగా ఆడిన ప్లేయర్లను టీమ్‌లోకి బీసీసీఐ తీసుకుంటుంది. వాళ్లు అంతర్జాతీయ స్థాయిలో అదే రకమైన ప్రదర్శన ఇవ్వలేరు.. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ వంటి హై ఓల్టేజీ మ్యాచుల్లో ఐపీఎల్ ఆడిన అనుభవం ఎందుకూ పనికి రాదంటూ మహ్మద్ హఫీజ్ కామెంట్స్ చేశారు.

Advertisement

Next Story