World Cup 2023: హైదరాబాద్ క్రికెట్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. ఉప్పల్‌లో టీమ్ ఇండియా మ్యాచ్‌లు లేనట్లేనా..? (వీడియో)

by Vinod kumar |   ( Updated:2023-07-22 06:32:38.0  )
World Cup 2023: హైదరాబాద్ క్రికెట్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్..  ఉప్పల్‌లో టీమ్ ఇండియా మ్యాచ్‌లు లేనట్లేనా..? (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: భారత్​ వేదికగా ఈ ఏడాది ఆక్టోబర్‌లో జరగనున్న వన్డే ప్రపంచకప్‌-2023కు సంబంధించిన డ్రాఫ్ట్​షెడ్యూల్‌ను బీసీసీఐ ఐసీసీకు పంపినట్లు తెలిసింది. టీమ్ ఇండియా గ్రూప్‌ స్టేజ్‌ మ్యాచ్‌లు ఆడేందుకు 9 వేదికలను బోర్డు ఖరారు చేసినట్లు సమాచారం. ఇప్పటికే ఈ మెగా ఈవెంట్‌కు సంబంధించిన డ్రాప్ట్‌ షెడ్యూల్‌ను బీసీసీఐ ఐసీసీకు పంపినట్లు ప్రముఖ వెబ్‌సైట్‌ వెల్లడించింది. మరోవైపు వన్డే వరల్డ్​ కప్​2023లోనూ పాక్-భారత్​ సమరాన్ని హైదరాబాద్ క్రికెట్ ​ప్రియులు మిస్ కానున్నట్లు తెలిసింది. తెలుగు రాష్ట్రాల క్రికెట్‌ అభిమానులకు బ్యాడ్‌ న్యూస్‌.

వన్డే ప్రపంచ కప్‌కు బీసీసీఐ షార్ట్‌ లిస్టు చేసిన వేదికల జాబితాలో హైదరాబాద్‌లోని ఉప్పల్‌ స్టేడియం ఒక్కటి. అయితే ఉప్పల్‌లో మాత్రం భారత జట్టు ఆడే సూచనలు కన్పించడం లేదు. టీమిండియా మ్యాచ్‌లకు సంబంధించి బీసీసీఐ సిద్దం చేసిన డ్రాప్ట్‌ షెడ్యూల్‌లో హైదరాబాద్‌ పేరు లేనట్లు తెలుస్తోంది. వేరే జట్లకు సంబంధించిన లీగ్‌ మ్యాచ్‌లు ఈ స్టేడియంలో జరిగే ఛాన్స్‌ ఉంది. ముఖ్యంగా క్రికెట్‌ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాకిస్తాన్‌-భారత్‌ మ్యాచ్‌ చెన్నై వేదికగా ఆక్టోబర్‌ 15న జరగనున్నట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story

Most Viewed