Love Reddy: సినిమా చూసి మహిళ ఎమోషనల్.. థియేటర్‌కి వచ్చిన నటుడిపై దాడి

by Ramesh Goud |
Love Reddy: సినిమా చూసి మహిళ ఎమోషనల్.. థియేటర్‌కి వచ్చిన నటుడిపై దాడి
X

దిశ, డైనమిక్ బ్యూరో: సినిమా చూసి ఎమోషనల్ అయిన ఓ మహిళా ప్రేక్షకురాలు థియేటర్‌కి వచ్చిన నటుడిపై దాడికి దిగిన ఘటన హైదరాబాద్‌లో జరిగింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. వీడియో ప్రకారం.. ఇటీవల విడుదలైన లవ్‌రెడ్డి సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో ఫ్యాన్స్ రెస్పాన్స్ చూసేందుకు చిత్రబృందం నగరంలోని జీపీఆర్ మాల్‌కు వెళ్లారు. సినిమా క్లైమాక్స్‌లో ఉండగా.. మూవీ టీం థియేటర్‌లోకి ఎంటర్ అయ్యింది. సినిమా క్లైమాక్స్ చూసి ఎమోషనల్ అయిన ఓ మహిళా ప్రేక్షకురాలు.. సినిమాలో తండ్రి పాత్రలో నటించిన వ్యక్తి ఎదురుగా కనడబే సరికి ఆగ్రహావేశాలు ఆపుకోలేకపోయింది.

నటుడు ఎన్టీ రామస్వామిపై దాడికి దిగింది. నటుడిని దూషిస్తూ.. గల్లా పట్టుకొని చెంపదెబ్బలు కొట్టేందుకు ప్రయత్నించింది. ఇంతలో అప్రమత్తమైన చిత్రబృందం ఆమెను అడ్డుకొని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఆయన తండ్రి పాత్రలో నటన మాత్రమే చేశారని, నిజజీవితంలో అలాంటివారు కాదని చెప్పడంతో ఆ మహిళ శాంతించింది. ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. ఇదంతా ముందుగానే ప్లాన్ చేసి ఉంటారని, పబ్లిసిటి స్టంట్ అని పలు రకాల కామెంట్లు పెడుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed