రతన్ టాటా వీలునామాలో పెంపుడు శునకానికి ఆస్తి !

by Y. Venkata Narasimha Reddy |   ( Updated:2024-10-25 10:37:31.0  )
రతన్ టాటా వీలునామాలో పెంపుడు శునకానికి ఆస్తి !
X

దిశ, వెబ్ డెస్క్ : ప్రముఖ పారిశ్రామికవేత్త దివంగత రతన్‌ టాటా(Ratan Tata's) మరణాంతరం ఆయన ఆస్తుల వీలునామా(will)పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. తన వ్యాపార దక్షతతో టాటా కంపెనీని కోట్లకు పడగలెత్తేలా చేసిన రతన్‌టాటా కంపెనీలంటే కేవలం లాభాలు, వ్యాపారాలు మాత్రమే కాదంటూ తన ఉదారతతో మానవతా విలువలను చాటుతూ అనేక సేవా కార్యక్రమాలు అమలు చేశారు. అటువంటి రతన్ టాటా తన ఆస్తుల వీలునామాను ఏ విధంగా రూపొందించి ఉంటారన్న చర్చ సాగుతోంది. కుబుంబ సభ్యులకు ఇచ్చిన ఆస్తుల కంటే సిబ్బందికి, తన పెంపుడు కుక్కకు ఏమైనా ఆస్తులు కేటాయించారా అన్నదానిపై ఎక్కువగా చర్చలు వినిపిస్తు్న్నాయి.

రతన్ టాటాకు మూగ జీవులపై ఎంతో ప్రేమ అనే విషయం అందరికి తెలిసిందే. వీధి శునకాల సంరక్షణ కోసం ఆసుపత్రులను కూడా నిర్మించారు. ఏకంగా తన తాజ్‌ హోటల్ ప్రాంగణంలో వీధి కుక్కలకు ఆశ్రయం కూడా కల్పించారు. ముంబయిలోని 5 అంతస్తుల భవనంలో పెట్ ప్రాజెక్ట్‌ పేరిట 200 శునకాలకు ఆశ్రయం కల్పించేలా ఏర్పాటు చేశారు. అలాంటి రతన్ టాటా తను పెంచుకున్న టిటో అనే కుక్క(pet dog) కోసం ఏమిచ్చారో తెలుసుకోవాలని అతృత సహజమే. రతన్ టాటా అంత్యక్రియల సందర్భంగా ఆయన పార్థీవ దేహం వద్ద టీటో పడిన వేదన అందరిని కలిచివేసింది. రతన్ టాటా తాను చనిపోయే ముందు రాసిన వీలునామాలో పెంపుడు కుక్క టిటో కోసం జీవితకాల సంరక్షణ ఖర్చులకు అవసరమైన మొత్తాన్ని కేటాయించినట్లుగా తెలుస్తోంది. టిటో బాధ్యతలను తన వద్ద ఎంతోకాలంగా పనిచేస్తున్న వంట మనిషి రాజన్‌ షాకు అప్పగించినట్లు జాతీయ మీడియా కథనం. వీలునామాలో మూడు దశాబ్దాలుగా తనవద్ద పని చేస్తూ తోడుగా ఉన్న వ్యక్తిగత సహాయకులు రాజన్ షా, సుబ్బయ్య పేర్లను కూడా చేర్చినట్లు తెలుస్తోంది.

ఇక రతన్‌ టాటా పేరున ఉన్న సుమారు రూ. 10 వేల కోట్ల ఆస్తులను ఆయన నెలకొల్పిన ఫౌండేషన్‌లకు, సోదరుడు జిమ్మీ టాటాకు, తన సహాయకులు, ఇతరులకు చెందుతాయని వీలునామాలో రాసినట్లు కధనాలు వినిపిస్తున్నాయి. హురున్ ఇండియా రిచ్ లిస్ట్ నివేదిక ప్రకారం.. టాటా సన్స్‌లో రతన్ టాటాకు 0.83 % వాటాలు ఉన్నాయి. దీని ప్రకారం, రతన్ టాటా ఆస్తుల నికర విలువ రూ.7వేల 900 కోట్లుగా ఉండనుంది. ప్రస్తుతం టాటా తన వీలునామాలో ఆస్తులతో పాటు పెట్టుబడులకు సంబంధించిన వివరాలు గోప్యంగా ఉంచారు. లిస్టెడ్ కంపెనీల్లో టాటా సన్స్ మార్కెట్ విలువ రూ.16.71 లక్షల కోట్లుగా ఉందని తెలుస్తోంది.

Advertisement

Next Story

Most Viewed

    null