- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పెద్ద శంకరంపేటలో హిందూ సంఘాల ఆధ్వర్యంలో స్వచ్ఛందంగా బంద్..
దిశ, పెద్దశంకరంపేట : హిందూ ఆరాధ్య దేవి దేవతల విగ్రహాలను ధ్వంసం చేయడానికి నిరసిస్తూ శుక్రవారం మండల కేంద్రమైన పెద్ద శంకరంపేటలో హిందూ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిరసన బంద్ కార్యక్రమం నిర్వహించారు.. పెద్ద శంకరంపేటలోని వ్యాపార వాణిజ్య సంస్థలు స్వచ్ఛందంగా తమ దుకాణాలను మూసివేసి నిరసన కార్యక్రమంలో పాల్గొని భారీ ర్యాలీ నిర్వహించారు. పేటలోని రామాలయం నుండి హిందూ సంఘాల బాధ్యులు అధిక సంఖ్యలో పట్టణ పురవీధుల గుండా జైశ్రీరామ్ భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హిందూ దేవి దేవతల విగ్రహాలను ధ్వంసం చేసిన వారిపై ప్రభుత్వం చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ జంగం శ్రీనివాస్, మండల బీజేపీ అధ్యక్షుడు కోణం విట్టల్, హిందూ సంఘాల ఐక్యవేదిక బాధ్యులు, అధిక సంఖ్యలో హిందూ సంఘాల వారు పాల్గొన్నారు.