- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇండియా vs పాకిస్తాన్.. వరల్డ్ కప్‌లో నేడు దాయాదుల పోరు
దిశ, వెబ్‌డెస్క్: మహిళల టీ20 వరల్డ్ కప్ 2023 అట్టహాసంగా ప్రారంభం అయ్యాయి. ఈ క్రమంలో ఇండియా vs పాకిస్తాన్ మ్యాచ్ ఈ రోజు సాయంత్రం జరగనుంది. దీంతో క్రికెట్ అభిమానులు దాయాదుల పోరును చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. కాగా ఇప్పటి వరకు మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత్‌తో పాకిస్తాన్ ఆరు సార్లు ఆడింది. ఇందులో పాకిస్తాన్ కేవలం.. రెండు మ్యాచుల్లోనే గెలిచింది.
కాగా ప్రస్తుతం పాకిస్తాన్ జట్టుకు బిస్మా మరూఫ్ కెప్టెన్‌గా వ్యవహరించనుంది. ఆదివారం గురువారం గ్రూప్-బీలో ఉన్న ఇరు జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్.. సాయంత్రం 6:30 గంటలకు ప్రారంభమవుతుంది. కాగా ఈ మ్యాచ్‌లో ఎలాగైన భారత్ ను ఓడించేందుకు పాక్ ప్లేయర్లు తమ ఫోన్లకు, సోషల్ మీడియాకు దూరంగా ఉన్నామని మ్యాచ్‌కు ముందు జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మరూఫ్ తెలిపింది.
భారత్ వైస్ కెప్టెన్ స్మృతి మంధనా.. వేలి గాయం కారణంగా మ్యాచ్ కు దూరం కానుండటం.. భారత్ కు పెద్ద ఎదురు దెబ్బగా క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. కాగా భారత మహిళల జట్టు మాత్రం పూర్తి విశ్వాసం తో గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ మ్యాచ్ లో ఆడేందుకు అంచనా జట్టు ఇలా ఉంది.
భారత మహిళా జట్టు: స్మృతి మంధాన..?, షఫాలీ వర్మ, యాస్తికా భాటియా, హర్మన్‌ప్రీత్ కౌర్(సి), జెమిమా రోడ్రిగ్స్, రిచా ఘోష్(w), పూజా వస్త్రాకర్, దీప్తి శర్మ, రాధా యాదవ్, రాజేశ్వరి గయక్వాడ్, రేణుకా ఠాకూర్ సింగ్, శిఖా వైద్య, దేవికా వైద్య, దేవిక హర్లీన్ డియోల్, అంజలి సర్వాణి
పాకిస్థాన్ మహిళా జట్టు: మునీబా అలీ, సిద్రా అమీన్, బిస్మా మరూఫ్ (సి), ఒమైమా సోహైల్, నిదా దార్, అలియా రియాజ్, సిద్రా నవాజ్ (w), ఫాతిమా సనా, నష్రా సంధు, జవేరియా ఖాన్, ఐమాన్ అన్వర్, సాదియా ఇక్బాల్, అయేషా నసీమ్ , తుబా హసన్, సదాఫ్ షమాస్