- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అమ్మాయిలు టైటిల్ నిలబెట్టుకుంటారా?.. నేటి నుంచి ఏషియన్ చాంపియన్స్ ట్రోఫీ
దిశ, స్పోర్ట్స్ : భారత మహిళల హాకీ జట్టు ఏషియన్ చాంపియన్స్ ట్రోఫీ టైటిల్ నిలబెట్టుకోవడంపై కన్నేసింది. బిహార్ వేదికగా సోమవారం నుంచి టోర్నీ ప్రారంభంకానుంది. ఈ టోర్నీకి భారత్ ఆతిథ్యమివ్వడం ఇది రెండోసారి. గతేడాది కూడా ఇండియానే వేదిక. ఆ టోర్నీలో భారత జట్టు విజేతగా నిలిచింది. ఈ సారి మిడ్ ఫీల్డర్ సలీమా టెటె సారథ్యంలో భారత జట్టు టైటిల్ నిలబెట్టుకోవడంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. కోచ్ కోచ్ హరేంద్ర సింగ్ మార్గదర్శకత్వంలో సన్నద్ధమైంది. అయితే, కొత్త సారథిగా నియామకమైన సలీమాకు ఈ టోర్నీతో పరీక్ష ఎదుర్కోనుంది.
సొంతగడ్డపై ఆడటం భారత్ జట్టులో ఆత్మవిశ్వాసం పెంచేదే. అలాగే, గోల్ కీపర్ సవిత, ఉదిత, సలీమా, నవ్‌నీత్ కౌర్, సంగీత కుమారి, బ్యూటీ డంగ్‌డంగ్‌లతో జట్టు బలంగానే కనిపిస్తున్నది. జట్టు నాకౌట్‌కు చేరుకోవడంపై అనుమానాలు లేవు. సెమీస్‌లోనే అసలు పరీక్ష ఎదురుకానుంది. చైనా, సౌత్ కొరియా, జపాన్‌లతో సవాల్ తప్పదు. నేడు తొలి మ్యాచ్‌లో మలేషియాతో తలపడనుంది. ఈ నెల 12న సౌత్ కొరియాతో, 14న థాయిలాండ్‌తో, 16న చైనాతో, 17న జపాన్‌తో తలపడనుంది. తొలి రౌండ్‌లో టాప్-4 జట్లు సెమీస్‌కు చేరుకుంటాయి. ఈ నెల 20న ఫైనల్ జరగనుంది.