- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వింబుల్డన్ చాంపియన్‌గా అల్కరాజ్.. ఫైనల్‌లో జకో చిత్తు
దిశ, స్పోర్ట్స్ : స్పెయిన్ యువ సంచలనం కార్లోస్ అల్కరాజ్ వింబుల్డన్ టెన్నిస్ గ్రాండ్‌స్లామ్ చాంపియన్‌గా నిలిచాడు. ఫైనల్‌లో దిగ్గజ ప్లేయర్ జకోవిచ్‌ను మట్టికరిపించి వరుసగా రెండోసారి మెన్స్ సింగిల్స్ టైటిల్ ఎగరేసుకపోయాడు. ఆదివారం జరిగిన ఫైనల్‌లో అల్కరాజ్ 6-2, 6-2, 7-6(7-4) తేడాతో జకోను ఓడించాడు. మ్యాచ్‌లో పూర్తిగా అల్కరాజ్ ఆధిపత్యం ప్రదర్శించాడు. సెర్బియా స్టార్ జకో కేవలం మూడో సెట్‌లో మాత్రమే పోటీనిచ్చాడు. తొలి రెండు సెట్లను అలవోకగా నెగ్గి అల్కరాజ్.. మూడో సెట్‌ను టై బ్రేకర్‌లో దక్కించుకుని టైటిల్ సాధించాడు. ఈ ఏడాది అల్కరాజ్‌కు ఇది రెండో గ్రాండ్‌స్లామ్ టైటిల్. ఈ టోర్నీకి ముందు ఫ్రెంచ్ ఓపెన్ విజేతగా నిలిచాడు. మొత్తంగా అల్కరాజ్ ఖాతాలో ఇది 4వ గ్రాండ్‌స్లామ్. మరోవైపు, 25వ గ్రాండ్‌స్లామ్ నెగ్గి అత్యధిక గ్రాండ్‌స్లామ్స్ నెగ్గి ప్లేయర్‌గా చరిత్ర సృష్టించాలనుకున్న జకోకు మరోసారి షాక్ తగిలింది.