- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కివీస్‌కు బ్యాడ్ న్యూస్.. రెండో టెస్టుకూ కేన్ విలియమ్స్ దూరం
by Harish |
X
దిశ, స్పోర్ట్స్ : న్యూజిలాండ్ మాజీ కెప్టెన్, బ్యాటర్ కేన్ విలియమ్స్ భారత్‌తో రెండో టెస్టుకు కూడా దూరమయ్యాడు. ఈ విషయాన్ని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు మంగళవారం వెల్లడించింది. ‘కేన్ విలియమ్స్ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాం. అతను వేగంగా కోలుకుంటున్నాడు. కానీ, 100 శాతం ఫిట్‌గా లేడు. మూడో టెస్టుకు అందుబాటులోకి రావొచ్చు. తనని తాను సిద్ధం చేసుకోవడానికి కేన్‌కు మేము సమయం ఇస్తాం’ అని న్యూజిలాండ్ హెడ్ కోచ్ గ్యారీ స్టెడ్ తెలిపాడు. కాగా, శ్రీలంకతో టెస్టు సిరీస్‌లో కేన్‌కు గజ్జల్లో గాయమైంది. భారత్‌తో సిరీస్ నాటికి కోలుకుంటాడని అతన్ని ఎంపిక చేశారు. కానీ, కోలుకోకపోవడంతో తొలి టెస్టుకు దూరమయ్యాడు. ప్రస్తుతం అతను ఇంకా న్యూజిలాండ్‌లోనే కోలుకుంటున్నాడు.
Advertisement
Next Story