- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Virat Kohli: సంచలన నిర్ణయం తీసుకున్న విరాట్ కోహ్లీ
దిశ,వెబ్ డెస్క్: ప్రపంచకప్‌లో భారత్ తుది మెట్టుపై బోల్తాపడింది. ఫైనల్లో భారత్‌పై ఆస్ట్రేలియా 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ ఓటమితో ఆటగాళ్లతో పాటు అభిమానులు కూడా ఎమోషనల్ అయ్యారు. మ్యాచ్ ముగిశాక రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, మహ్మద్ సిరాజ్ కన్నీళ్లు పెట్టుకున్నారు. విరాట్ కోహ్లీ దుఃఖాన్ని ఆపుకోలేక టోపీని అడ్డు పెట్టుకున్నాడు.ఇదిలా ఉండగా కింగ్ కోహ్లీ గురించి ఓ వార్త నెట్టింట హల్చల్ చేస్తుంది. అదేంటో ఇక్కడ తెలుసుకుందాం..
విరాట్ కోహ్లీ వన్డే ప్రపంచకప్ ఫైనల్లో ఓటమి తర్వాత సంచలన నిర్ణయం తీసుకున్నాడు. విరాట్ తన మేనేజర్ బంటీ సజ్‌దేహ్ ను తొలిగించినట్లు సమాచారం. దశాబ్ద కాలంగా స్నేహితుడికి కంటే ఎక్కువగా ఉన్న వీరిద్దరి మధ్య దూరం హాట్ టాపిక్‌గా మారింది. గత పదేళ్లుగా కోహ్లి వ్యాపారకార్యకలాపాలను బంటినే పర్యవేక్షిస్తున్నాడు. కోహ్లి వాణిజ్య ప్రయోజనాలు, బ్రాండ్ వాల్యూ వంటి అంశాలను బంటీ పర్యవేక్షిస్తుంటారు. ఇతడు విరాట్ కోహ్లీకి స్నేహితుడి కంటే ఎక్కువని చాలామంది చెబుతుంటారు. అలాంటి అనుబంధాన్ని కోహ్లి తెంచుకున్నాడు. అయితే విడిపోవడానికి స్పష్టమైన కారణాలు తెలియడం లేదు. కోహ్లినే సొంతంగా 100 కోట్ల రూపాయలతో ఓ కంపెనీ ప్రారంభించే యోచనలో ఉన్నట్లు తెలిసింది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా ప్రారంభించినట్లు సమాచారం.
More News: ప్రధాని మోడీపై షోయాబ్ అక్తర్ ప్రశంసలు
- Tags
- virat kohli