విరాట్ కోహ్లీ అరుదైన ఘనత.. సచిన్ ఆల్‌టైమ్ రికార్డు బద్దలు!

by Vinod kumar |
విరాట్ కోహ్లీ అరుదైన ఘనత.. సచిన్ ఆల్‌టైమ్ రికార్డు బద్దలు!
X

దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా బ్యాటర్ విరాట్ కోహ్లీ అరుదైన ఘనతను సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో 25 వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. ఈ ఘనత సాధించిన ఆరో బ్యాటర్‌గా.. రెండో ఇండియన్ ప్లేయర్‌గా నిలిచాడు. ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఢిల్లీ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్‌లో ఈ మైలురాయిని అధిగమించాడు. అత్యంత వేగంగా ఈ ఘనతను అందుకు తొలి ప్లేయర్‌గా విరాట్ కోహ్లీ నిలిచాడు.

ఈ క్రమంలో సచిన్ టెండూల్కర్ రికార్డును అధిగమించాడు. 492 మ్యాచ్‌లు, 549 ఇన్నింగ్స్‌లోనే విరాట్ కోహ్లీ ఈ ఘనతను అందుకున్నాడు. సచిన్ టెండూల్కర్ 577 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఫీట్ సాధించాడు. అత్యధిక పరుగుల జాబితాలో సచిన్ టెండూల్కర్ 34,357 పరుగులతో అగ్రస్థానంలో ఉండగా.. రికీ పాంటింగ్(27,483), జాక్వస్ కల్లీస్(25,534), కుమార సంగంక్కర(28,016), మహేళ జయవర్దనే(25,957) కోహ్లీ కన్నా ముందున్నారు. టెస్ట్‌ల్లో ఇప్పటి వరకు 8,186 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ.. వన్డేల్లో 12,809, టీ20ల్లో 4,008 పరుగులు చేశాడు.

రెండో ఇన్నింగ్స్‌లో నిలకడగా ఆడిన విరాట్ కోహ్లీ(20) టాడ్ మర్ఫీ బౌలింగ్‌లో స్టంపౌటయ్యాడు. టెస్ట్ ఫార్మాట్‌లో కోహ్లీ స్టంపౌటవ్వడం ఇదే తొలిసారి. రెండో టెస్టులో ఆస్ట్రేలియాపై భారత్ ఘన విజయం. ఆస్ట్రేలియాపై 6 వికెట్ల తేడాతో గెలిచిన భారత్. నాలుగు టెస్టుల సిరీస్‌లో 2-0 ఆధిక్యంలో భారత్. ఆస్ట్రేలియా స్కోర్లు 263, 113 ఆలౌట్.. భారత్ స్కోర్లు 262 ఆలౌట్, 118/4.. రెండు ఇన్నింగ్స్‌లలో 10 వికెట్ల తీసిన రవీంద్ర జడేజా.

Advertisement

Next Story

Most Viewed