ఆలోచనల్లో, చేతల్లో కోహ్లీ ఓ ఆస్ట్రేలియన్.. స్టీవ్ స్మిత్ ఆసక్తికర వ్యాఖ్యలు

by Harish |
ఆలోచనల్లో, చేతల్లో కోహ్లీ ఓ ఆస్ట్రేలియన్.. స్టీవ్ స్మిత్ ఆసక్తికర వ్యాఖ్యలు
X

దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీపై ఆస్ట్రేలియా బ్యాటర్ స్టీవ్ స్మిత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆలోచనల్లో, చేతల్లో కోహ్లీ ఓ ఆస్ట్రేలియన్‌‌లా‌గా కనిపిస్తాడని వ్యాఖ్యానించాడు. తాజాగా స్టార్ స్పోర్ట్స్‌తో స్మిత్ మాట్లాడుతూ.. కోహ్లీ‌తో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నాడు. అతనో అద్భుతమైన ప్లేయర్ అని, గొప్ప వ్యక్తి అని ప్రశంసించాడు. తామిద్దరం మంచి స్నేహితులమని, మెసేజ్‌లు చేసుకుంటామని తెలిపాడు.

కోహ్లీకి వ్యతిరేకంగా ఆడటం బాగుంటుందన్నాడు. ‘అతను మైదానంలోకి దిగే విధానం, సవాళ్లను ఎదుర్కొనే తీరు, ప్రత్యర్థిపై పైచేయి సాధించాలనే విధంగానే ఉంటాయి. భారత జట్టులో అతనో ఆస్ట్రేలియన్‌లాగా కనిపిస్తాడు.’ అని తెలిపాడు. బ్యాటర్‌గా విరాట్‌తో పోటీపడాలనే ఆలోచన తనకు లేదని, జట్టు విజయమే ముఖ్యమని స్మిత్ చెప్పుకొచ్చాడు.

కాగా, భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగే ప్రతిష్టాత్మక బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ఈ ఏడాది ఆస్ట్రేలియా ఆతిథ్యమిస్తున్నది. నవంబర్ 22 నుంచి ఐదు టెస్టుల సిరీస్ ప్రారంభంకానుంది. 2016-17 నుంచి టీమిండియానే సిరీస్‌ను గెలుస్తూ వస్తున్నది. 2018-19, 2020-21 ఎడిషన్లలో ఆసిస్ గడ్డపైనే కంగారులను మట్టికరిపించింది. గతేడాది భారత్‌లో ఆసిస్ జట్టుకు షాకిచ్చిన రోహిత్ సేన ఈ సారి కూడా ఫేవరెట్‌గా బరిలోకి దిగనుంది.

Advertisement

Next Story

Most Viewed