- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
paris olympics : వినేశ్ ఫొగట్ కోసం రంగంలోకి అమెరికా దిగ్గజ రెజ్లర్.. అతని డిమాండ్ ఏంటంటే?
దిశ, స్పోర్ట్స్ : పారిస్ విశ్వక్రీడల్లో అదనపు బరువు కారణంగా భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగట్‌పై వేటు వేయడం అంతర్జాతీయ రెజ్లింగ్‌లో పెద్ద దుమారం రేపింది. ఆమెకు అంతర్జాతీయంగా మద్దతు లభిస్తోంది. ఫైనల్‌కు అర్హత సాధించిన వినేశ్‌కు కనీసం రజత పతకమైనా ఇవ్వాలన్న డిమాండ్ వ్యక్తమవుతున్నది. వినేశ్‌కు సిల్వర్ మెడల్ ఇవ్వాలని అమెరికా రెజ్లింగ్ దిగ్గజం జోర్డాన్ బరోజ్ డిమాండ్ చేశాడు. ఆరుసార్లు వరల్డ్ చాంపియన్, 2012 లండన్ ఒలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్ అయిన జోర్డాన్ బరోజ్ ఎక్స్ వేదికగా వినేశ్‌కు మద్దతు ప్రకటించాడు. ‘ఇలాంటి ఘటనలతో ఐవోసీ మేల్కోవాలి. రెజ్లింగ్‌కు ఆరు కంటే ఎక్కువ కేటగిరీలు అవసరం. వినేశ్ ముగ్గురు ప్రపంచ స్థాయి అథ్లెట్లతో కఠిన మ్యాచ్‌లు ఆడింది. గోల్డ్ మెడల్ మ్యాచ్ కోసం రాత్రంతా కష్టపడింది. ఏ అథ్లెట్ అలా కష్టపడొద్దు. ఫైనల్ కోసం వినేశ్ అర్హత పొందేందుకు భారత బృందం చివరి వరకు ప్రయత్నించింది. వారికి ఇది నిరాశే.’అని తెలిపాడు.
అలాగే, యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్(యూడబ్ల్యూడబ్ల్యూ) నిబంధనల్లో మార్పులను సూచించాడు. రెండో రోజు రెజ్లర్ల బరువులో ఒక కిలో వరకు మినహాయింపు ఇవ్వాలని, ఉదయం 8:30 నుంచి 10:30 మధ్య బరువను కొలవొద్దని చెప్పాడు. సెమీస్ విజయం తర్వాత రెండో రోజు బరువు కోల్పోయినప్పటికీ ఫైనలిస్ట్‌లకు పతకాలు ఇవ్వాలని, నిర్దిష్ట బరువు ఉన్న రెజ్లర్‌కే స్వర్ణం ఇవ్వాలన్నాడు. ఇక, చివరి డిమాండ్‌గా వినేశ్‌కు సిల్వర్ మెడల్ ఇవ్వాలన్ని రాసుకొచ్చాడు. జోర్డాన్ బరోజ్ డిమాండ్‌ను 2016 రియో ఒలింపిక్స్ మెడలిస్ట్ సాక్షి మాలిక్ సమర్థించింది. తాను అదే అప్పీలు చేస్తున్నానని, వారు అంగీకరిస్తే సరైన నిర్ణయమవుతుందని ఎక్స్‌లో పోస్టు చేసింది.