Paris Olympics: నిద్రలో నుంచి వచ్చి గోల్డ్ మెడల్ సాధించిన ప్లేయర్

by Mahesh |
Paris Olympics: నిద్రలో నుంచి వచ్చి గోల్డ్ మెడల్ సాధించిన ప్లేయర్
X

దిశ, వెబ్‌డెస్క్: పారిస్ ఒలింపిక్స్ లో పలు దేశాల ప్లేయర్లు తమ మొదటి పథకం గెలవడానికి తీవ్రంగా కష్టపడినప్పటికి ఫలితం దక్కడం లేదు. అలాంటిది ఓ ప్లేయర్ ఏకంగా నిద్రలో నుండి లేచి వచ్చి.. డైరెక్ట్ గోల్డ్ మెడల్ ను సాధించి అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. వివరాల్లోకి వెళితే.. పారిస్ ఒలింపిక్స్ ఉక్రెయిన్ కు చెందిన క్రీడాకారిణి యారోస్లావా ముహుచిత్ ఉమెన్స్ హై-జంప్ గోల్డ్ మెడల్ ఇవేంట్ ముందు తనకు కేటాయించిన స్థలం వద్ద ఉన్న బ్యాగుపై హాయిగా నిద్రపోతూ కనిపించింది. అదే సమయంలో గేమ్ నిర్వాహకులు తదుపరి రావాల్సిందిగా యారోస్లావా ముహుచిత్ అని ప్రకటించారు. దీంతో ఆమె నిద్ర నుంచి లేచి నేరుగా వచ్చి హై జంప్ చేసింది. కాగా ఈ ఈవెంట్‌లో ఎవరు ఆమె చేసిన హై జంప్ ను బీట్ చేయలేకపోవడంతో ఆమెకు గోల్డ్ మెడల్ వచ్చింది. ఇది చూసిన ప్రేక్షకులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. అయితే మెడల్ అందుకున్న తర్వాత యారోస్లావా ముహుచిత్ మాట్లాడుతూ.. తాను ఎలాంటి ఆందోళనకు గురికాకుండా.. రిలాక్స్ అయ్యేందుకు ఇలా కాసేపు నిద్రిస్తుంటానని.. అదే తన విజయానికి రహస్యం అంటూ చెప్పుకొచ్చింది.

Advertisement

Next Story

Most Viewed