- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Trending News: టీమిండియా హెడ్ కోచ్ రేసులో మోడీ, అమిత్ షా.. అసలు విషయం ఏంటంటే?
దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం టీమిండియా కోచ్‌గా భారత మాజీ బ్యాట్స్‌మెన్ రాహుల్ ద్రావిడ్ కొనసాగుతున్నారు. అయితే, ఆ పదవీ కాలం టీ 20 వరల్డ్ కప్‌తో ముగియనుంది. ఈ క్రమంలోనే టీమిండియా హెడ్ కోచ్ పదవి కోసం ఈనెల భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) నోటిఫికేషన్ విడుదల చేసింది. సోమవారం సాయంత్రం గడువు ముగిసే సమయానికి ఔత్సాహికుల నుంచి 3,400 దరఖాస్తులు వచ్చాయి. అయితే, వీటిలో భారీ సంఖ్యలో ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా, సచిన్ టెండూల్కర్, షారుఖ్ ఖాన్, ఎంఎస్ ధోనీ, హర్భజన్ సింగ్, వీరేంద్ర సెహ్వాగ్ పేర్లతో నకిలీ దరఖాస్తులు వచ్చినట్లుగా బీసీసీ గుర్తించింది. దీంతో అప్రమత్తమైన బోర్డు సిబ్బంది వాటన్నింటిని వేరు చేసే పనిలో పడింది. అప్లికేషన్ ప్రక్రియ పబ్లిక్ డొమైన్‌లో నిర్వహించడం వల్ల అందరూ దరఖాస్తు చేసుకునేందుకు వీలుండటంతో ఫేర్ అప్లికేషన్ల బెడద ఉందని బీసీసీఐ తెలిపింది.