మూడో టెస్టులో మళ్లీ సెంచరీతో చెలరేగిన ట్రావిస్ హెడ్.. భారీ స్కోరు దిశగా ఆసిస్

by Mahesh |
మూడో టెస్టులో మళ్లీ సెంచరీతో చెలరేగిన ట్రావిస్ హెడ్.. భారీ స్కోరు దిశగా ఆసిస్
X

దిశ, వెబ్ డెస్క్: భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఐదు టెస్ట్ మ్యాచుల సిరీస్ జరుగుతుంది. ఇందులో ఇప్పటికే రెండు పూర్తవ్వగా.. శనివారం నుంచి మూడో టెస్ట్(Third test) మ్యాచ్ బ్రిస్బేన్‌ వేదికగా ప్రారంభం అయింది. కాగా ఈ మ్యాచులో టాస్ గెలిచిన భారత్(India) బౌలింగ్ ఎంచుకోవడంతో ఆస్ట్రేలియా(Australia) జట్టు మొదట బ్యాటింగ్ ప్రారంభించింది. అయితే మొదటి రోజు 13.2 ఓవర్ల వద్ద భారీ వర్షం కురవడంతో మొదటి రోజు మ్యాచును రద్దు చేశారు. అనంతరం ఆదివారం రెండో రోజు మ్యాచ్ ప్రారంభం అయిన కొద్ది సేపటికే ఆస్ట్రేలియా రెండు వికెట్లను కోల్పోయింది. దీంతో భారత బౌలర్లు పుంజుకుంటున్నారనుకునే సమయంలో వచ్చిన ట్రావిస్ హెడ్(Travis Head), స్టీవ్ స్మిత్(Steve Smith) లు భారత బౌలర్లకు చుక్కలు చూపించారు. బౌలర్లను దీటుగా ఎందుర్కొంటూ.. లూస్ బంతులను బౌండరీలకు తరలిస్తూ.. తమ జట్టును భారీ స్కోర్ వైపు పరుగులు పెట్టించారు.

ఈ క్రమంలో ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ హెడ్ భారత జట్టుకు మరోసారి తలనొప్పిగా మారాడు. రెండో రోజు మొత్తం 119 బంతులు ఆడిన హెడ్ 13 ఫోర్లతో సెంచరీ నమోదు చేశాడు. రెండో టెస్టులో కూడా హెడ్ ఏకంగా 140 పరుగులు చేసి విజయంలో కీలక పాత్ర పోషించాడు. ప్రస్తుతం హెడ్ 122 బంతుల్లో 105 పరుగులు చేసి క్రీజులో కొనసాగుతున్నాడు. అలాగే మరోపక్క స్టీవ్ స్మిత్ కూడా నిలకడగా రాణిస్తూ.. సెంచరీ దిశగా ముందుకు సాగుతున్నాడు. మొత్తం 150 బంతులను ఆడిన స్మిత్ 43 స్ట్రైక్ రేటుతో 65 పరుగులు చేశాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియా జట్టు 71 ఓవర్లకు 3 వికెట్లు కోల్పోయి 237 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో ఉన్న హెడ్, స్మిత్ ఇలానే కొనసాగితే ఆస్ట్రేలియా జట్టు 500 కంటే ఎక్కువ స్కోర్ చేసే అవకాశం ఉన్నట్లు క్రికెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed