Happy Birthday Sachin Tendulkar:హ్యాపీ బర్త్ డే మాస్టర్ బ్లాస్టర్

by Mahesh |   ( Updated:2023-04-24 03:39:22.0  )
Happy Birthday Sachin Tendulkar:హ్యాపీ బర్త్ డే మాస్టర్ బ్లాస్టర్
X

దిశ, వెబ్‌డెస్క్: ఈ రోజు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూలక్కర్ పుట్టినరోజు. అతి చిన్న వయసులో క్రికెట్ పై ఉన్న ప్రేమతో తన చదువును సైతం పక్కనపెట్టి.. సచిన్ సుదీర్ఘ కాలంలో భారత క్రికెట్‌కు గాడ్ గుర్తింపు పొందారు. 11 ఏళ్ల వయసులో బ్యాట్ పట్టిన సచిన్.. సూదిర్ఘ కాలం పాటు భారత క్రికెట్‌కు ఏనలేన సేవలు అందించాడు. భారత జట్టులోకి 1989, నవంబర్ 15న అధికారింగా మొదటి మ్యాచ్ పాకిస్తాన్ జట్టుపై ఆడాడు. నాటి నుంచి 2013 నవంబర్ 16 రిటైర్మెంట్ ప్రకటించే సమయానికి.. టెండూల్కర్.. 200 టెస్టులు, 463 వన్డేలు, 1 టీ20, 78 ఐపీఎల్ మ్యాచులు ఆడాడు.

అలాగే టెస్టుల్లో 15921, వన్డేల్లో 18426, టీ20లో 12, ఐపీఎల్‌లో 2334, పరుగులు చేశాడు. సచిన్ టెండూల్కర్ మొత్తం కెరీర్‌లో 100 ఇంటర్నేషనల్ సెంచరీలు, 164 అర్థ సెంచరీలు సాధించాడు. అలాగే ఐపీఎల్ లో 1 సెంచరీ 13 అర్థసెంచరీలు ఉన్నాయి. కాగా సచిన్ కెరీర్ బెస్ట్ స్కోర్ టెస్టుల్లో 248*, వన్డేల్లో 200* ఐపీఎల్ లో 100* నాటౌట్‌గా ఉన్నాయి. అలాగే సచిన్ బౌలర్‌గా కూడా రాణించారు. మొత్తం అన్ని విభాగాల్లో కలిపి 201 వికెట్లు పడగొట్టారు. సచిన్ టెండూల్కర్ 49 సంవత్సరాలు పూర్తిచేసుకుని 50 వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నారు.

Read more:

శిర్షాసనంతో సచిన్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వీరేంద్ర సెహ్వాగ్

Advertisement

Next Story

Most Viewed