ఆ ఐదు సిక్సులు నా జీవితాన్నే మర్చేశాయి.. Rinku Singh

by Vinod kumar |   ( Updated:2023-08-22 10:53:22.0  )
ఆ ఐదు సిక్సులు నా జీవితాన్నే మర్చేశాయి.. Rinku Singh
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ ​2023లో గుజరాత్​ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్​కతా నైట్​రైడర్స్​ బ్యాటర్​ రింకూ సింగ్.. చివర ఓవర్‌లో కొట్టిన ఐదు సిక్సులు.. ఇప్పటికీ ఎవరూ మర్చిపోలేం. ఐపీఎల్‌లో అదరగొట్టి ఐర్లాండ్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌కు ఎంపికైన రింకూ సింగ్.. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. ఐర్లాండ్‌తో జరిగిన రెండో 20లో సత్తా చాటాడు. 21 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌ల సాయంతో 38 పరుగులు చేసి 'ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌'గా నిలిచాడు. అయితే ఈ మ్యాచ్​తర్వాత.. బ్యాటర్​ రింకూ సింగ్‌ను భారత స్పిన్నర్‌ రవిబిష్ణోయ్‌ ఇంటర్వ్యూ చేశాడు. ఈ సందర్భంగా ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్‌పై చివరి ఓవర్‌లో వరుసగా ఐదు సిక్స్‌లు బాదిన విషయాన్ని గుర్తు చేసుకున్నాడు. ఆ ఐదు సిక్స్‌లు తన జీవితాన్ని మార్చేశాయని రింకూ సింగ్ తెలిపాడు.

''మొదటి మ్యాచ్‌లో బ్యాటింగ్ చేయడానికి చాలా ఉత్సాహంగా ఉన్నాను. కానీ నాకు అవకాశం రాలేదు. రెండో టీ20లో బ్యాటింగ్‌ చేసే ఛాన్స్‌ వచ్చినందుకు చాలా సంతోషంగా ఫీలయ్యా. ఐపీఎల్‌లో ఆడినట్లుగానే చివరి వరకు ఆడాలని అనుకున్నాను. ప్రశాంతంగా ఉంటూ చివరి 2-3 ఓవర్లు హిట్టింగ్‌ చేయాలని ప్రణాళిక వేసుకున్నా. ఐదు సిక్సర్లు (ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్‌పై) నా జీవితాన్ని మార్చేశాయి. ఆ ఇన్నింగ్స్‌ నుంచే నాకు గుర్తింపు వచ్చింది. అభిమానులు స్టాండ్స్‌ నుంచి రింకూ.. రింకూ అని ఉత్సాహపరచడాన్ని ఇష్టపడతా'' అంటూ రింకూ చెప్పుకొచ్చాడు.

Advertisement

Next Story

Most Viewed