ఒంటికాలితో బ్యాటింగ్ అదరగొట్టిన యువకుడు.. వీడియో వైరల్

by Vinod kumar |
ఒంటికాలితో బ్యాటింగ్ అదరగొట్టిన యువకుడు.. వీడియో వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: భారత్‌లో క్రికెట్‌ ఫాలోయింగే వేరు. ప్రతి గల్లీలో క్రికెట్‌కు వీరాభిమానులుంటారు. అలాంటి ఓ వీరాభిమాని బ్యాటింగ్‌ నెటిజన్లను ఔరా అనిపిస్తోంది. దివ్యాంగులు కూడా దీనికి అతీతం కాదు. తాజాగా అలాంటి ఓ వ్యక్తి క్రికెట్‌ ఆడుతున్న వీడియో వైరల్‌గా మారింది. సదరు వ్యక్తి ఒంటి కాలితో బ్యాటింగ్‌ అదరగొట్టాడు. అతడి బ్యాటింగ్‌కు నెటిజన్లు ఫిదా అయ్యారు. వైకల్యం అతడి ఉత్సాహాన్ని ఏ మాత్రం కుంగదీయలేదు. సంకల్ప బలంతో వైకల్యాన్ని ఎదిరించి తనకు ఇష్టమైన క్రికెట్‌ను ఆస్వాదిస్తున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా షేర్‌ అవుతోంది. నెటిజన్లు కూడా అతడిని ఉత్సాహపర్చేలా కామెంట్లు పెడుతున్నారు. ‘సూపర్‌ బ్రో.. ఇలానే ముందుకు సాగండి.. ఆల్ ది బెస్ట్’ ‘మీ ఆట ఎంతో మందికి ఆదర్శం’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed