పవన్ కల్యాణ్‌కు అస్వస్థత.. ఆందోళనలో ఫ్యాన్స్

by Gantepaka Srikanth |   ( Updated:2024-10-11 04:33:11.0  )
పవన్ కల్యాణ్‌కు అస్వస్థత.. ఆందోళనలో ఫ్యాన్స్
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan) మరోసారి అస్వస్థతకు గురయ్యారు. దగ్గు, జలుబు, జ్వరం, తీవ్రమైన గొంతునొప్పితో బాధపడుతున్న ఆయన.. గురువారం ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఈ కారణంగానే ఇవాళ్టి కేబినెట్ సమావేశానికి పవన్ కల్యాణ్ హాజరు కాలేదు. ఇటీవల తిరుమలకు కాలినడకన వెళ్లిన ఆయన అనారోగ్యానికి గురైన విషయం తెలిసిందే. జ్వరంతో బాధపడుతూనే వారాహి సభలో పాల్గొన్నారు. పవన్ కల్యాణ్ అనారోగ్యం బారినపడిన విషయం తెలుసుకున్న అభిమానులు త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు.

Read more: బయటపడ్డ పవన్ కల్యాణ్ సీక్రెట్ ఫోటోస్.. మరీ ఇంత అలవోకగా ఎలా..?

Advertisement

Next Story