పాన్ ఇండియా సినిమాతో రాబోతున్న టాలీవుడ్ యంగ్ హీరో.. ఊరమాస్ లుక్ రిలీజ్

by Hamsa |   ( Updated:2024-10-10 11:06:30.0  )
పాన్ ఇండియా సినిమాతో రాబోతున్న టాలీవుడ్ యంగ్ హీరో.. ఊరమాస్ లుక్ రిలీజ్
X

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్(Raj Tarun) వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ప్రజెంట్ రాజ్ తరుణ్, సందీప్ మాధవ్ హీరోలుగా నటిస్తున్న తాజా చిత్రం ‘రామ్ భజరంగ్’. సుధీర్ రాజు(Sudheer Raju) తెరకెక్కిస్తున్న ఈ చిత్రం సన్ రైజ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మాత స్వాతి సుధీర్ నిర్మిస్తున్నారు. అయితే ఇందులో సిమ్రత్ కౌర్, సట్నా టైటస్, చాయా దేవి, మానసా రాధాకృష్ణన్ హీరోయిన్స్‌గా నటిస్తుండగా.. షఫీ, శివ రామరాజు, వెంకట్, సత్యం రాజేష్, రాజా రవీంద్ర, రవి శంకర్, ధనరాజ్, రచ్చ రవి, ఐశ్వర్య కీలక పాత్రలో కనిపించబోతున్నారు. అయితే 1980 బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో పాన్ ఇండియా మూవీగా వచ్చే ఏడాది విడుదల కాబోతుంది. తాజాగా, ‘రామ్ భజరంగ్’(Ram Bajrang) సినిమా నుంచి రాజ్ తరుణ్, సందీప్ ఫస్ట్ లుక్ విడుదలైంది. ఇందులో బిడీ తాగుతూ వీరిద్దరూ ఊరమాస్ లుక్‌లో కనిపించి అంచనాలను పెంచేశారు. ఈ పోస్టర్‌ను రాజ్ తరుణ్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసి దసరా శుభాకాంక్షలు తెలిపారు. ఇక అది చూసిన వారంతా ఫైర్ ఎమోజీలను షేర్ చేస్తున్నారు.

Advertisement

Next Story