Vettaiyan: రజినీకాంత్ ‘వేట్టయన్’ ఓటీటీ స్ట్రీమింగ్‌పై ఇంట్రెస్టింగ్ న్యూస్

by sudharani |   ( Updated:2024-10-10 10:53:37.0  )
Vettaiyan: రజినీకాంత్ ‘వేట్టయన్’ ఓటీటీ స్ట్రీమింగ్‌పై ఇంట్రెస్టింగ్ న్యూస్
X

దిశ, సినిమా: సూప‌ర్‌స్టార్ రజినీకాంత్ (Rajinikanth) లేటెస్ట్ మూవీ ‘వేట్టయన్- ద హంట‌ర్‌’. ‘జై భీమ్’ ఫేమ్ టి.జె.జ్ఞాన‌వేల్ (TJ Gnanvale) ద‌ర్శక‌త్వం వహించిన ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడ‌క్షన్స్ బ్యాన‌ర్‌పై సుభాస్కర‌న్ ఈ సినిమాను నిర్మించారు. సురేష్ ప్రొడక్షన్స్‌తో కలిసి ఏసియన్ సునీల్, దిల్ రాజు ఈ చిత్రాన్ని తెలుగులోకి రిలీజ్ చేశారు. ఇక ‘వేట్టయన్’ (Vettaiyan) విడుదలకు ముందు అందులో నుంచి వచ్చిన ప్రతి అప్‌డేట్ ఎంతో ఆకట్టుకోగా.. భారీ అంచనాల మధ్య నేడు ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైంది. ప్రజెంట్ ఈ చిత్రం మిక్స్‌డ్ టాక్‌తో స్క్రీనింగ్ అవుతోంది. ఇదిలా ఉంటే.. ఇప్పుడు వేట్టయన్ ఓటీటీ స్ట్రీమింగ్‌పై ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

‘వేట్టయన్ - ద హంట‌ర్‌’ డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ (OTT) సంస్థ అమెజాన్ ప్రైమ్ (Amazon Prime) భారీ ధరకు సొంతం చేసుకున్నట్లు సమాచారం. అయితే.. స్ట్రీమింగ్ (streaming) ఎప్పుడనేదానిపై క్లారిటీ రానప్పటికీ హై బడ్జెట్ మూవీ కాబట్టి.. ఓటీటీ రిలీజ్ కాస్త ఎక్కువ సమయమే పడుతుందంటున్నాయి సినీ వర్గాలు. కాగా.. ఈ చిత్రంలో దుషారా విజయన్‌, రితికా సింగ్‌ మేల్‌ లీడ్ రోల్స్‌లో నటించగా.. రానా దగ్గుబాటి, రావు రమేశ్‌, ఫహద్ ఫాసిల్, మంజు వారియర్, రోహిణి మొల్లేటి కీలక పాత్రలు పోషించారు.

Advertisement

Next Story