పిడుగు పడి ఒకరి మృతి ,ముుగ్గురికి అస్వస్థత

by Y. Venkata Narasimha Reddy |
పిడుగు పడి ఒకరి మృతి ,ముుగ్గురికి అస్వస్థత
X

దిశ, వెబ్ డెస్క్ : నల్గొండ జిల్లా దామరచర్ల మండలంలో పిడుగుపడి ఒకరు మృతి చెందగా ముగ్గురికి అస్వస్థతకు గురయ్యారు. దామరచర్ల మండలంలోని వీర్లపాలెం గ్రామంలో స్థానిక రైతులు, కూలీలు వ్యవసాయ పనులలో ఉండగా గురువారం మధ్యాహ్నంఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. వర్షం పడుతున్న క్రమంలో చెట్టు కింద ఉన్న వారిపై పిడుగు పడగా ఒకరు మృతి చెందారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిశాయి. పలు జిల్లా్ల్లో కోతలకు సిద్ధంగా ఉన్న వరి పంటలు, కళ్లాల్లో ఉన్న ధాన్యం నీటి పాలైంది. పత్తి చేనులు సైతం వరుస వర్షాలతో దెబ్బతింటున్నాయని రైతులు వాపోతున్నారు.

Advertisement

Next Story