2025లోనూ సేమ్ సీన్ రిపీట్.. ఆరెంజ్ క్యాప్ గెలవడంపై విరాట్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

by Satheesh |
2025లోనూ సేమ్ సీన్ రిపీట్.. ఆరెంజ్ క్యాప్ గెలవడంపై విరాట్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: క్రికెట్ ప్రియులను దాదాపు నెలన్నర రోజుల పాటు ఉర్రూతలూగించిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 సీజన్ ఆదివారం ముగిసింది. చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్‌ను చిత్తుచేసి కోల్‌కతా నైట్ రైడర్స్ విజేతగా నిలిచింది. ఇక, ఈ సీజన్‌లో ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ 15 మ్యాచుల్లో 744 పరుగులు చేసి అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. తద్వారా 2024 సీజన్ ఆరెంజ్ క్యాప్‌ను విరాట్ గెల్చుకున్నాడు. ఆరెంజ్ క్యాప్ విన్నర్‌గా నిలవడంపై విరాట్ రియాక్ట్ అయ్యాడు. 2025లోనూ ఇదే తరహా ఫామ్‌ను కొనసాగిస్తానని ధీమా వ్యక్తం చేశాడు.

ఆరెంజ్ క్యాప్ గెల్చుకోవడం పట్ల ఆనందంగా ఉన్నప్పటికీ.. తమ జట్టు టైటిల్ సీజన్‌ ఫస్టాఫ్‌లో ఒడిదొడుకులను ఎదుర్కొన్నదని అన్నారు. లీగ్ సెకండాఫ్‌లో ఆర్సీబీ వరుస విజయాలతో అద్భుతం చేసినప్పటికీ.. ప్లే ఆఫ్స్‌లో ఓటమి చెందడంతో చివరికి ఫలితం లేకుండా పోయిందని కాస్త ఎమోషనల్ అయ్యారు. ఆటలో గెలుపు ఓటములు సహజమని.. వచ్చే సీజన్‌లో మరింత ఆత్మవిశ్వాసంతో బలంగా తిరిగి వస్తామని ఆశాభావం వ్యక్తం చేశాడు. కాగా, ఎలిమినేటర్-1 మ్యాచ్‌లో రాజస్థాన్‌పై ఓడి ఆర్సీబీ టైటిల్ రేస్ నుండి నిష్క్రమించిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story