ఘనంగా జాతీయ క్రీడా పురస్కారాల ప్రదానోత్సవం

by Javid Pasha |   ( Updated:2022-12-01 04:11:08.0  )
ఘనంగా జాతీయ క్రీడా పురస్కారాల ప్రదానోత్సవం
X

దిశ, వెబ్ డెస్క్: ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జాతీయ క్రీడా పురస్కారాల ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. వివిధ క్రీడల్లో ప్రతిభ కనబర్చిన క్రీడాకారులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పురస్కారాలు అందజేశారు. టేబుల్ టెన్నిస్ ప్లేయర్ అచంట శరత్ కమల్ ధ్యాన్‌చంద్ ఖేల్ రత్న అవార్డును అందుకున్నాడు. భారత స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్, టేబుల్ టెన్నిస్ ప్లేయర్ ఆకుల శ్రీజ సహా మొత్తం 25 మంది అర్జున అవార్డు అందుకున్నారు. పీఎం మోడీ, వివిధ రాష్ట్రాల సీఎంలు, కేంద్రమంత్రులతో పాటు అనేకమంది ప్రముఖులు అవార్డు గ్రహీతలకు అభినందనలు తెలిపారు.


అర్జున అవార్డు గ్రహీతలు వీళ్లే..

అవినాష్ సాబుల్ (అథ్లెటిక్స్), సీమా పూనియా (అథ్లెటిక్స్), ఆల్డస్ పాల్ (అథ్లెటిక్స్), లక్ష్య సేన్ (బ్యాడ్మింటన్), హెచ్. ఎస్ ప్రణయ్ (బ్యాడ్మింటన్),నిఖత్ జరీన్ (బాక్సింగ్), అమిత్ (బాక్సింగ్), ఆర్ ప్రజ్ఞానంద (చెస్), భక్తి కులకర్ణి (చెస్) ,​​సుశీలా దేవి (జూడో), సాక్షి కుమారి (కబడ్డీ), నయన్ మోని సైకియా (లోన్‌బాల్), దీప్ గ్రేస్ ఇక్కా (హాకీ), సాగర్ ఓవల్కర్ (మల్కాంబ్), ఓంప్రకాష్ మిథర్వాల్ (షూటింగ్) ఎలవెనిల్ వలరివన్ (షూటింగ్), శ్రీజ ఆకుల (టేబుల్ టెన్నిస్), వికాస్ ఠాకూర్ (వెయిట్ లిఫ్టింగ్), సరిత (రెజ్లింగ్), అన్షు (రెజ్లింగ్), పర్వీన్ (వుషు), తరుణ్ ధిల్లాన్ (పారా బ్యాడ్మింటన్), మాన్సీ జోషి (పారా బ్యాడ్మింటన్), స్వప్నిల్ పాటిల్ (పారా స్విమ్మింగ్), జెర్లిన్ అనికా జె (చెవిటి బ్యాడ్మింటన్).




Advertisement

Next Story

Most Viewed