రాహుల్ ద్రావిడ్ రికార్డ్ బద్దలు కొట్టిన కోహ్లీ.. ఇక నెక్ట్స్ అతడే..!

by Satheesh |   ( Updated:2022-09-26 14:03:48.0  )
రాహుల్ ద్రావిడ్ రికార్డ్ బద్దలు కొట్టిన కోహ్లీ.. ఇక నెక్ట్స్ అతడే..!
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగిన సిరీస్ డిసైడర్ మ్యాచ్‌లో ఆసీస్‌పై టీమిండియా ఘనవిజయం సాధించింది. 187 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఆదిలోని షాక్ తగిలింది. ఓపెనర్లు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ వెంట వెంటనే వికెట్లు కోల్పోయారు. అనంతరం బరిలోకి దిగిన టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ అద్భుత ప్రదర్శనతో టీమిండియాను విజయతీరాలకు చేర్చారు.

విరాట్ కోహ్లీ 48 బంతుల్లో నాలుగు సిక్సర్లు, మూడు ఫోర్లతో 63 ర‌న్స్ చేయగా.. సూర్యకుమార్ యాదవ్ 36 బంతుల్లోనే 69 పరుగలు చేసి ఆసీస్ బౌలర్లను ఊచకోత కోశాడు. కోహ్లీ, సూర్య మెరుపు బ్యాటింగ్‌కు తోడు చివర్లో ఆల్ రౌండర్ పాండ్యా ఆకాశమే హద్దుగా చెలరేగి భారత్‌కు విజయాన్నందించాడు. దీంతో 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది. ఇక మ్యాచ్‌లో 63 పరుగులతో రాణించిన కోహ్లీ మరో రికార్డ్ సాధించాడు. భారత్ తరపున మూడు ఫార్మాట్లలో కలిపి అత్యధిక పరుగులు చేసిన రెండో క్రికెటర్‌గా రికార్డ్ సృష్టించాడు. ఇప్పటి వరకు ఈ రికార్డ్ రాహుల్ ద్రావిడ్ పేరిట ఉండగా.. ఆసీస్‌తో జరిగిన 3వ టీ20లో కోహ్లీ అధిగమించాడు. భారత తరుఫున మూడు ఫార్మెట్లలో కలిపి ద్రావిడ్ 504 మ్యాచుల్లో 24064 రన్స్ చేయగా.. కోహ్లీ 471 మ్యాచుల్లో 24078 రన్స్‌తో ద్రావిడ్ రికార్డును బద్దలు కొట్టాడు.

కేవలం 471 మ్యాచుల్లోనే కోహ్లి ఈ రన్స్ చేయడం గమనార్హం. ఇక, 664 మ్యాచ్‌లు ఆడి 34,357 పరుగులతో భారత తరఫున మూడు ఫార్మాట్లలో కలిపి అత్యధిక పరుగులు చేసిన తొలి బ్యాటర్‌గా మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కొనసాగుతున్నాడు. తాజాగా ఆసీస్‌తో జరిగిన మ్యాచ్‌లో 63 పరుగులు చేసిన కోహ్లీ ద్రావిడ్‌ను అధిగమించి.. భారత తరఫున మూడు ఫార్మాట్లలో కలిపి అత్యధిక రన్స్ చేసిన రెండో భారత బ్యాటర్‌గా కొనసాగుతున్నాడు. భారత్ తరుఫున అత్యధిక పరుగులు చేసిన జాబితాలో కోహ్లీ కన్నా ముందే ఒక్క సచిన్ టెండూల్కర్ మాత్రమే ఉన్నాడు.

ALSO READ : టీమిండియా గేమ్ ఛేంజర్‌.. అనుష్క ఎమోషనల్ పోస్ట్ వైరల్

Advertisement

Next Story

Most Viewed