- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాజ్‌కోట్ టెస్టులో టీమిండియా ఘన విజయం
దిశ, వెబ్‌డెస్క్: రాజ్‌కోట్ టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. 434 పరుగుల భారీ తేడాతో ప్రత్యర్థి ఇంగ్లాండ్‌ను మట్టికరిపించింది. ఈ మూడో టెస్టులోని సెకండ్ ఇన్నింగ్స్‌లో టీమిండియా యువ ఓపెనర్ యశస్వీ జైస్వాల్ విశ్వరూపం చూపించాడు. ఆకాశమే హద్దుగా చెలరేగిన జైస్వాల్ డబుల్ సెంచరీతో పెను విధ్వంసం సృష్టించాడు. అతనికి సర్ఫరాజ్ ఖాన్(68) కూడా సహకరించాడు. శుభ్‌మన్ గిల్(91) తృటిలో సెంచరీ చేజార్జుకున్నాడు. ఈ ముగ్గురు కుర్రాళ్లు అదరగొట్టడంతో రెండో ఇన్నింగ్స్‌లో భారత జట్టు 430/4 పరుగుల భారీ స్కోర్ వద్ద తమ ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది.
దీంతో ఇంగ్లండ్ ముందు టీమిండియా 557 పరుగుల కొండంత లక్ష్యాన్ని ఉంచింది. చేధనలో బ్యాటింగ్‌కు వచ్చిన ఇంగ్లాండ్ బ్యాటర్లు వరుసగా విఫలమయ్యారు. కేవలం 122 పరుగులకే అందరూ చేతులెత్తేశారు. ఈ మ్యాచ్‌లో రవీంద్ర జడేజా 5 వికెట్లు తీయగా, కుల్దీప్ యాదవ్ రెండు వికెట్లు తీశాడు. అశ్విన్, బూమ్రా చెరో వికెట్ తీసి ఇంగ్లాండ్‌ను ఆలౌట్ చేశారు. దీంతో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను భారత జట్టు 02-01 తో లీడ్‌లో కొనసాగుతోంది.