టీం ఇండియా @1000.. వెస్టిండీస్ సిరీస్‌తో వెయ్యి మ్యాచుల రికార్డు

by Disha News Desk |
టీం ఇండియా @1000.. వెస్టిండీస్ సిరీస్‌తో వెయ్యి మ్యాచుల రికార్డు
X

న్యూఢిల్లీ : భారత క్రికెట్ జట్టు సరికొత్త రికార్డును తన పేరిట లిఖించు కునేందుకు మరో అడుగు దూరంలో నిలిచింది. ఫిబ్రవరిలో జరిగే వెస్టిండీస్ సిరీస్‌తో 1000 మ్యాచులు ఆడిన జట్టుగా టీం ఇండియా మరో సంచలనం సృష్టించనుంది. వన్డేల్లో వెయ్యి మ్యాచులు ఆడిన జాబితాలో భారత జట్టుకు సమానంగా ఇతర దేశాల జట్టు ఏమీ కనిపించడం లేదు.1974లో టీం ఇండియా ఇంగ్లాండ్ జట్టుతో తొలి వన్డే మ్యాచ్ ఆడగా.. 2022 మొన్న జరిగిన సౌతాఫ్రికా టూర్‌తో మొత్తం 999 మ్యాచులను పూర్తి చేసుకుంది. ఫిబ్రవరి 6 నుంచి 11 వరకు కరేబియన్ జట్టుతో జరగనున్న 3 వన్డేల సిరీస్ ద్వారా భారత జట్టు వెయ్యి మ్యాచుల ఫీట్ అందుకోనుంది. ఇది టీమిండియాకే కాకుండా కెప్టెన్ రోహిత్ శర్మకు కూడా చెదిరిపోని జ్ఞాపకంగా మారనుంది.1000 వన్డే మ్యాచ్‌కు సారథ్యం వహించిన క్రికెటర్‌గా హిట్‌మ్యాన్ చరిత్రలో నిలిచిపోనున్నాడు.

భారత్ తర్వాత స్థానం ఎవరిదంటే..

వన్డేల్లో వెయ్యి మ్యాచులు ఆడిన జాబితాలో భారత్ (999) తొలి స్థానంలో నిలవగా 2వ స్థానంలో ఆస్ట్రేలియా (958), 3వ స్థానంలో పాకిస్తాన్ (936)గా నిలిచాయి. వన్డేలో టీం ఇండియా అత్యధిక మ్యాచులు ఆడినప్పటికి విన్నింగ్ పర్సంటేజ్ మాత్రం ఆస్ట్రేలియా జట్టుకు అత్యధికంగా ఉంది. ఆసిస్ ఇప్పటివరకు 581 వన్డేల్లో విక్టరీ కొట్టగా భారత్ కేవలం 518 వన్డేల్లో మాత్రమే విజయం సాధించి 54.54 శాతం పర్సంటేజ్ కలిగి ఉంది.

2023 వరల్డ్ ప్రిపరేషన్‌..

2023లో జరగనున్న వరల్డ్ కప్ టోర్నీ ప్రిపరేషన్ కోసం బీసీసీఐ తీవ్రంగా కసరత్తు చేస్తోంది.సౌతాఫ్రికా మ్యాచ్ లో జరిగిన తప్పిదాలు భవిష్యత్తులో మరోసారి చోటుచేసుకోకుండా స్ట్రాంగ్ టీమును తయారు చేసేందుకు బీసీసీఐ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. అందుకోసమే కొత్త ఆటగాళ్లను తీసుకుని వారిని వెస్టిండీస్, శ్రీలంక సిరీస్ లో ఆడించి అందులోని మేటి ఆటగాళ్లను జట్టులోకి తీసుకోవాలని భావిస్తోంది. యజువేంద్ర చాహల్ లేదా రవి బిష్ణోయ్, సూర్యకుమార్ యాదవ్ లేదా శ్రేయస్ అయ్యర్, శార్దుల్ ఠాకూర్ లేదా దీపక్ చాహర్ వీరిలో ఎవరు సత్తా చాటుతారో వారు జట్టులో చోటు దక్కించుకుంటారు. కేఎల్ రాహుల్ ఓపెనర్ నుంచి మిడిల్ ఆర్డర్, వాషింగ్టన్ సుందర్ ను ఆల్ రౌండర్ స్థానంలో రాణించనున్నాడు.

మైల్ స్టోన్ అందుకున్న కెప్టెన్స్..

టీం ఇండియా తొలి వన్డే మ్యాచ్ ఇంగ్లాండ్‌తో జరగగా దీనికి అజిత్ వాడేకర్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. 100వ మ్యాచ్‌లో కపిల్ దేవ్- ఆస్ట్రేలియా, 500 మ్యా్చ్ గంగూలీ- ఇంగ్లాడ్, 600 మ్యాచ్ సెహ్వాగ్- శ్రీలంక, 700 మ్యాచ్ ధోని- ఇంగ్లాండ్, 750 మ్యాచ్ ధోని- శ్రీలంక, 900 మ్యాచ్ ధోని-న్యూజీలాండ్, 1000 మ్యాచ్ రోహిత్-వెస్టిండీస్‌తో జరగాల్సి ఉంది.

Advertisement

Next Story

Most Viewed