Ashes 2023 2nd Test: లంచ్ టైమ్.. స్టీవ్‌ స్మిత్‌ సెంచరీ.. ఆసీస్ ఆలౌట్

by Vinod kumar |
Ashes 2023 2nd Test: లంచ్ టైమ్.. స్టీవ్‌ స్మిత్‌ సెంచరీ.. ఆసీస్ ఆలౌట్
X

దిశ, వెబ్‌డెస్క్: యాషెస్‌ సిరీస్‌లో భాగంగా లార్డ్స్‌ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 416 పరుగులకు ఆలౌట్‌ అయింది. ఆసీస్ బ్యాటర్స్‌లో.. స్టీవ్‌ స్మిత్‌ 110 పరుగులతో సెంచరీ చేయగా.. ట్రెవిస్‌ హెడ్‌ (77), డేవిడ్‌ వార్నర్‌ (66) పరుగులు చేశారు. 339/5 ఓవర్‌నైట్‌ స్కోరుతో రెండోరోజు ఆటను ప్రారంభించిన ఆసీస్‌ తొలి సెషన్‌లోనే తమ పోరాటాన్ని ముగించింది. ఇంగ్లండ్‌ బౌలర్లలో జోష్‌ టంగ్‌, ఓలీ రాబిన్సన్‌లు చెరో 3 వికెట్లు తీయగా.. జో రూట్‌ 2, అండర్సన్‌, బ్రాడ్‌లు ఒక్కో వికెట్‌ తీశారు. తొలి ఇన్నింగ్స్‌ ఆరంభించిన ఇంగ్లండ్‌ లంచ్‌ విరామ సమయానికి వికెట్‌ నష్టపోకుండా 13 పరుగులు చేసింది. జాక్‌ క్రాలీ (6), బెన్‌ డకెట్‌ (7) పరుగులతో క్రీజులో ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed