- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
క్వార్టర్స్‌కు శ్రీరామ్-జీవన్ జోడీ
చెన్నై: చెన్నై ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్‌లో భారత ద్వయం, టాప్ సీడ్ శ్రీరామ్ బాలాజీ-జీవన్ క్వార్టర్స్‌కు చేరుకున్నారు. బుధవారం జరిగిన తొలి రౌండ్‌లో భారత జోడీ 6-4, 7-5 తేడాతో పోర్చుగల్-అమెరికా జంట ఫెరీరా సిల్వా-నికోలస్ మోరెనో అల్బోరాన్‌ను చిత్తు చేసింది. ప్రత్యర్థి జోడీ నుంచి తీవ్రమైన పోటీని ఎదురైనప్పటికీ శ్రీరామ్ బాలాజీ-జీవన్ జోడీ అద్భుతంగా ఆడి వరుస సెట్లను గెలుచుకున్నారు.
మరో భారత జంట సుమిత్ నగల్-శశికుమార్ ముకుంద్ సైతం క్వార్టర్స్‌కు చేరుకుంది. తైవాన్‌కు చెందిన యు హ్సియు హ్సు-క్రిస్టోఫర్ జోడీతో తలపడిన భారత జోడీ వాకోవర్ ద్వారా టోర్నీలో ముందడుగు వేసింది. ఈ మ్యాచ్‌లో తొలి సెట్‌ను 7-6 తేడాతో దక్కించుకున్న భారత జోడీ.. రెండో సెట్‌లో 2-1తో ఆధిక్యంలో ఉండగా తైవాన్ జోడీ ఆట నుంచి నిష్క్రమించింది. సుమిత్-శశికుమార్ ద్వయం క్వార్టర్స్‌లో శ్రీరామ్ బాలాజీ-జీవన్ జోడీతో తలపడనున్నది.