'రహానేకు వైస్ కెప్టెన్సీ.. ఎలా ఇస్తారు?'.. Sourav Ganguly

by Vinod kumar |
రహానేకు వైస్ కెప్టెన్సీ.. ఎలా ఇస్తారు?.. Sourav Ganguly
X

న్యూఢిల్లీ : వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌కు సీనియర్ బ్యాటర్ అజింక్య రహానేకు వైస్ కెప్టెన్సీ ఇవ్వడాన్ని బీసీసీఐ మాజీ అధ్యక్షుడు, మాజీ దిగ్గజ క్రికెటర్ సౌరవ్ గంగూలీ తప్పుబట్టాడు. తాజా ఇంటర్వ్యూలో దాదా సెలెక్టర్ల తీరుపై విమర్శలు చేశాడు. ఆ నిర్ణయం వెనుకడుగు అనుకోవడం లేదని, అలాగే, అతన్ని ఎందుకు ఎంపిక చేశారో కూడా అర్థం కావడం లేదన్నాడు. ‘18 నెలలు జట్టుకు దూరంగా ఉండి ఒక మ్యాచ్ ఆడగానే వైస్ కెప్టెన్సీ ఇచ్చారు. దాని వెనుక ఉన్న ఆలోచన ఏంటో నాకు అర్థమవడం లేదు. వైస్ కెప్టెన్సీకి రవీంద్ర జడేజా అర్హుడు.

చాలాకాలంగా అతను టెస్టు మ్యాచ్‌లు ఆడుతున్నాడు.’ అని తెలిపాడు. సెలెక్షన్‌లో కఠినం, ఉదాసీనత ఉండకూడదని, కొనసాగింపు, స్థిరత్వం ఉండాలన్నాడు. సీనియర్ బ్యాటర్ పుజారా విషయంలో సెలెక్టర్లు తమ అభిప్రాయాన్ని స్పష్టంగా తెలియజేయాలని చెప్పాడు. ‘టెస్టు క్రికెట్‍లో అతడి అవసరం ఇంకా ఉందా? లేకపోతే యువకులను తీసుకోవాలనుకుంటున్నారా?.. అతడికి సెలెక్టర్లు స్పష్టం చేయాలి. జట్టు నుంచి తప్పించి మళ్లీ తీసుకుని, మళ్లీ తప్పించే ఆటగాడు కాదు పుజారా. రహానే విషయంలో కూడా అంతే.’ అని గంగూలీ తెలిపాడు.

Advertisement

Next Story

Most Viewed