పాకిస్తాన్ ప్లేయర్స్ పారితోషికం కంటే.. స్మృతి మంధాన పారితోషికం రెండింతలు ఎక్కువ

by Mahesh |
పాకిస్తాన్ ప్లేయర్స్ పారితోషికం కంటే.. స్మృతి మంధాన పారితోషికం రెండింతలు ఎక్కువ
X

దిశ, వెబ్‌డెస్క్: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్.. వేలం సోమవారం అట్టహాసంగా జరిగింది. ఈ వేలంలో స్టార్ ప్లేయర్లకు ఆయా జట్లు కోట్లు రూపాయలు వేచించాయి. ఈ క్రమంలోనే భారత స్టార్ బ్యాటర్ అయినా స్మృతి మంధాన ను వేలంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ₹ 3.4 కోట్లకు కొనుగోలు చేసింది. కాగా ఇది.. పాకిస్థాన్ సూపర్ లీగ్ (పిఎస్‌ఎల్) అత్యధిక పారితోషికం పొందిన ఆటగాళ్ల కంటే రెట్టింపుగా ఉందని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు.

అలాగే.. PSL యొక్క అత్యంత ఖరీదైన ఆటగాళ్లు, బాబర్ ఆజం, షాహీన్ అఫ్రిది, షాదాబ్ ఖాన్‌లకు $130,000 నుండి $170,000 (₹1 కోటి నుండి ₹1.4 కోట్ల కంటే ఎక్కువ) పరిధిలో మాత్రమే పారితోషికం చెల్లించబడుతుంది. కాగా కేవలం మొదటి WPL వేలంలోనే భారత ప్లేయర్లు ఇంత భారీ ధర పలికితే.. రానున్న మరిన్ని సీజన్లలో ఎంత ధరను పలుకుతారో అని క్రికెట్ అభిమానులు చర్చించుకుంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed