- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కోహ్లీపై అక్తర్ సంచలన కామెంట్స్.. ఆమె వల్లే ప్రాబ్లమ్స్ అంటూ ఆరోపణలు
దిశ, వెబ్‌డెస్క్: పాక్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్దిశ, వెబ్‌డెస్క్: పాక్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీపై ఆసక్తికర వ్యా్ఖ్యలు చేశాడు. కోహ్లీ టెస్ట్ కెప్టెన్సీ నుండి తప్పుకున్న దగ్గరి నుండి అతడి చూట్టూ వివాదాలు తిరుగుతూనే ఉన్నాయి. అక్తర్ దైనిక్ జాగరణ్‌తో మాట్లాడుతూ.. 'విరాట్ అనుష్కను పెళ్లి చేసుకోవడం అతని కెరీర్‌పై ప్రభావం చూపిందని పేర్కొన్నాడు. ఒక క్రికెటర్ జీవితంపై వివాహం ఖచ్చితంగా ప్రభావం చూపిస్తుందని చెప్పారు. నేను పెళ్లి చేసుకోవడం తప్పనడం లేదు.. కానీ కెరీర్ మంచి పొజిషన్‌లో ఉన్నప్పుడు చేసుకోవడం మాత్రం కరెక్ట్ కాదని అభిప్రాయపడ్డాడు. వివాహం తర్వాత కుటుంబ బాధ్యత, పిల్లలు, ఇలా రకరకాల ఒత్తిళ్లు ఉంటాయని అన్నాడు. ఈ సమయంలో కెరీర్‌పై ఫోకస్ చేయడం కష్టంగా ఉంటుందని వివరించాడు. విరాట్ కెరీర్ మంచి దశలో ఉన్న సమయంలో వివాహం చేసుకున్నాడు.. అతడి స్థానంలో నేను ఉంటే ఖచ్చితంగా పెళ్లి చేసుకోకపోయేవాడినని తెలిపాడు. అంతే కాకుండా ప్రతి క్రికెటర్‌కు కెరీర్‌లో 10- 12 సంవత్సరాల వ్యవధి ఉంటుంది. దాంట్లో వారు ఒక 5-6 సంవత్సరాలు కెరీర్ అత్యుత్తమ దశలో ఉంటారు. ప్రస్తుతం విరాట్ కెరీర్‌లో ఆ దశ ముగిసిపోయింది. ఇక నుండి అతడు పరుగుల కోసం కష్టపడవలసి ఉంటుందని చెప్పారు. నాకు విరాట్ కెప్టెన్‌గా ఉండటం కంటే అతడు మంచి పరుగులు సాధించాలని కోరుకుంటానని వెల్లడించాడు.