వన్డే సిరీస్‌ కెప్టెన్‌గా శిఖర్ ధావన్ (Shikhar Dhawan)

by Hajipasha |   ( Updated:2022-09-12 10:39:07.0  )
వన్డే సిరీస్‌ కెప్టెన్‌గా శిఖర్ ధావన్ (Shikhar Dhawan)
X

న్యూఢిల్లీ: దక్షిణాఫ్రికాతో టీమిండియాకు జరిగే వన్డే సిరీస్‌లకు కెప్టెన్‌గా శిఖర్ ధావన్ వ్యవహరించనున్నాడు. ఈ విషయాన్ని బీసీసీఐ సోమవారం అధికారికంగా వెల్లడించింది. టీ20 ప్రపంచకప్‌కు ముందు దక్షిణాఫ్రికాతో టీమిండియాకు వన్డే సిరీస్‌లు ఆడనుంది. ఈ క్రమంలో టీ20 ప్రపంచకప్ కోసం దక్షిణాఫ్రికాతో జరిగే వన్డే సిరీస్‌కు భారత జట్టులోని కీలక ఆటగాళ్లకు విశ్రాంతి ఇవ్వనున్నారు.

కెప్టెన్ రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ వన్డేలకు దూరం కానున్నట్లు సమాచారం. దీంతో స్టార్ బ్యాటర్ శిఖర్ ధావన్ మరోసారి టీమ్ ఇండియాకు సారథ్యం వహించనున్నాడు. సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 11వ తేదీ వరకు భారత్-దక్షిణాఫ్రికా మధ్య మూడు టీ20, మూడు వన్డే సిరీస్‌లు జరగనున్నాయి. భారత్ వేదికగా ఇరు జట్ల మధ్య తొలి టీ20 మ్యాచ్ సెప్టెంబర్ 8న జరగనుంది. అక్టోబర్ 2న రెండో టీ20, అక్టోబర్ 4న మూడో టీ20 మ్యాచులు జరగనున్నాయి. ఈ సిరీస్ ముగిసిన తర్వాత అక్టోబర్ 6, 9, 11వ తేదీల్లో వన్డే సిరీస్‌లు జరగనుంది. కాగా, స్టార్ పేసర్లు జస్పీత్ బుమ్రా, షమీ జట్టులోకి తిరిగి రానుండటంతో టీ20లో భారత్ బౌలింగ్ పటిష్టంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Advertisement

Next Story